అదేమో కానీ ప్రభాస్ సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్ అన్నది సమస్య అవుతోంది ఇటీవల. పెద్ద హీరోల సినిమాలకు హీరోయిన్లు సమస్య కావచ్చు.
విలన్ల సమస్య కావచ్చు కానీ మ్యూజిక్ డైరక్టర్ సమస్య కాకూడదు. కానీ సాహో విషయంలో అదే సమస్య అయింది. ఆఖరికి రకరకాల పాటలు చేయించినా ఆశించిన ఫలితం రాలేదు.
ప్రభాస్ రాథేశ్వామ్ సినిమా షూట్ సగం పూర్తయింది కానీ ఇప్పటి వరకు మ్యూజిక్ డైరక్టర్ పేరు ప్రకటించలేదు. ఆఖరికి ఇప్పుడు ఫిక్స్ చేసారు.
గతంలో ఓ తెలుగు సినిమా చేసిన జస్టిన్ ప్రభాకరన్ ను రాథేశ్వామ్ కు తీసుకున్నారు. తమిళంలో పలు సినిమాలు చేసిన జస్టిన్ తెలుగులో చేయడం ఇది రెండోసారి.
తమిళంలో మరీ భారీ సినిమాలు చేయకపోయినా, మంచి పాటలు ఇచ్చే మ్యూజిక్ డైరక్టర్ గా జస్టిన్ ప్రభాకరన్ కు పేరుంది. అందువల్ల రాథేశ్వామ్ నుంచి మంచి ఆల్బమ్ నే వస్తుంది అని ఆశించవచ్చు. ఓ విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ నే.