‘జ్వాల’ రగిల్చిన తమన్నా

ఏజ్ వస్తున్నా కూడా తన ఫిజిక్ ను కాపాడుకుంటూ, డ్యాన్స్ మూవ్ మెంట్లలో తనకు సాటి ఎవరనే క్వశ్చన్ ఎప్పటికప్పుడు లైవ్ లో వుంచుతూ వస్తున్న హీరోయిన్ తమన్నా.  ధర్టీ ప్లస్ హీరోయిన్ అయినా…

ఏజ్ వస్తున్నా కూడా తన ఫిజిక్ ను కాపాడుకుంటూ, డ్యాన్స్ మూవ్ మెంట్లలో తనకు సాటి ఎవరనే క్వశ్చన్ ఎప్పటికప్పుడు లైవ్ లో వుంచుతూ వస్తున్న హీరోయిన్ తమన్నా.  ధర్టీ ప్లస్ హీరోయిన్ అయినా అస్సలు ఆ ఆలోచనే రానివ్వదు ఆడియన్స్ కు. లేటెస్ట్ గా సంపత్ నంది- గోపీచంద్ సీటీమార్ సినిమాలో ఆమె చేసిన పాట విడియోను ఆన్ లైన్ లో విడుదల చేసారు.

ఈ పాటకు సినిమా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పాటలో గోపీచంద్ చేసిందేమీ లేదు. ఒకటి రెండు స్టెప్ లు తప్ప, కానీ తమన్నా వేసిన చిందులు మాత్రం మామూలుగా లేవు. ఆ చిందులకు తగినట్లు పాట, ఆ పాట ట్యూన్, దానికి సూటయ్యే తమన్నా విలేజ్ డాల్ గెటప్.

టోటల్ గా విడియో సాంగ్ వైరల్ అయ్యే దారిలోనే వుంది. కానీ ఒక్కటే చిన్న మైనస్. మణిశర్మ లాంటి సీనియర్ కూడా తెలంగాణ ఫోక్ సాంగ్ ను అలా కొట్టేయడం. కనీసపు క్రెడిట్ కార్డ్ వేయకపోవడం. ''గొల్లా మల్లమ్మ కోడలా..' అనే సాంగ్…'నడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా' అనే సాంగ్ రెండూ గుర్తుకు వస్తాయి ఈ జ్వాలా రెడ్డి సాంగ్ వినగానే. అయినా ఈ మధ్య ఇదే ఫ్యాషన్ అయిపోయింది. తెలంగాణ ఫోక్ ట్యూన్ లు  తీసుకోవడం కాసర్ల శ్యామ్ చేతనో మరొకళ్ల చేతనో రాయించి, పాట చేయించేడం. 

ఏమైతేనే పాట హిట్ కావడం పక్కా. సంపత్ నంది దగ్గర కమర్షియల్ మీటర్ వుంది. ఆ వైనం ఈ పాట పిక్చరైజేషన్ లో క్లారిటీగా కనిపించింది. ఏప్రిల్ 2న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు సీటీ మార్ సినిమాను. అదే రోజు నాగ్ వైల్డ్ డాగ్ కూడా విడుదలవుతోంది.