ఇంగ్లిష్ టీచర్ గా మారిన కాజల్

చాలామంది హీరోయిన్లు వెండితెరపై టీచర్ల పాత్రలు పోషించారు. కాజల్ కూడా అలా ఇంగ్లిష్ టీచర్ గా మారిపోయిందనుకోవద్దు. ఆమె నిజంగానే టీచర్ గా మారింది. నిజజీవితంలో ఆమె ఇంగ్లిష్ టీచర్ అవతారం ఎత్తి, పాఠాలు…

చాలామంది హీరోయిన్లు వెండితెరపై టీచర్ల పాత్రలు పోషించారు. కాజల్ కూడా అలా ఇంగ్లిష్ టీచర్ గా మారిపోయిందనుకోవద్దు. ఆమె నిజంగానే టీచర్ గా మారింది. నిజజీవితంలో ఆమె ఇంగ్లిష్ టీచర్ అవతారం ఎత్తి, పాఠాలు కూడా బోధించింది.

“కొవిడ్ ఫస్ట్ వేవ్ లో నన్ను నేను ఉత్సాహంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాను. నిరుత్సాహం, నిస్పృహలు దరిచేరనీయకుండా నన్ను నేను బిజీగా ఉంచుకున్నాను. అందులో భాగంగా నేను ఆన్ లైన్ క్లాసులు కూడా తీసుకున్నాను. కానీ సెకెండ్ వేవ్ లో నాకు ఆ అవసరం రాలేదు. అందుకే టీచర్ అవతారం ఎత్తాను. మా పనిమనిషి కొడుక్కి ఇంగ్లిష్ పాఠాలు చెప్పాను.”

సెకెండ్ వేవ్ లో విద్యార్థులు ఎక్కువగా నష్టపోయిన విషయాన్ని గమనించానంటోంది కాజల్. ముంబయిలోని తన ఇంటి చుట్టుపక్కల చాలామంది విద్యార్థులు చదువుల్లేక ఉండిపోయిన విషయాన్ని తెలుసుకున్నానని, అందుకే కనీసం తన పనిమనిషి కొడుక్కి అయినా పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇంగ్లిష్ టీచర్ గా మారిపోయానని అంటోంది కాజల్.

లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్కసారిగా బిజీ అయింది కాజల్. తగినన్ని జాగ్రత్తలతో తిరిగి నార్మల్ లైఫ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు షూటింగ్స్ లో ఒంటరిగా అనిపించేదని, కానీ ఇప్పుడు తన భర్త గౌతమ్ చాలాసార్లు తనతో పాటు షూటింగ్స్ కు వస్తున్నాడని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.