కాజల్ జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చేసిందా?

భగవంత్ కేసరి ఎలా ఉంది? దాని రిజల్ట్ ఏంటి? కలెక్షన్ ఎంత? అనే విషయాన్ని పక్కనపెడదాం. ఈ సినిమాతో కాజల్ రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీ అంటే ఎలా ఉండాలి? మరి కాజల్ కు ఈ…

భగవంత్ కేసరి ఎలా ఉంది? దాని రిజల్ట్ ఏంటి? కలెక్షన్ ఎంత? అనే విషయాన్ని పక్కనపెడదాం. ఈ సినిమాతో కాజల్ రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీ అంటే ఎలా ఉండాలి? మరి కాజల్ కు ఈ రీఎంట్రీ మూవీ కలిసొచ్చిందా?

భగవంత్ కేసరి సినిమాలో నటించడానికి కాజల్ ఎందుకు ఒప్పుకుందో ఆమెకే తెలియాలి. ఈమె పోషించిన కాత్యాయని పాత్రలో డెప్త్ లేదు. సినిమాతో కనెక్షన్ కూడా తక్కువే. కేవలం కామెడీ పండించే స్కోప్ ఉందని అంగీకరించినట్టుంది. ఆ యాంగిల్ లో కూడా కాజల్ అంతంతమాత్రంగానే మెరిసింది.

ఇన్నాళ్లూ తెరపై ఫుల్ లెంగ్త్ లో కాజల్ ను చూసిన ప్రేక్షకులు, భగవంత్ కేసరి సినిమాలో చాలా తక్కువ స్క్రీన్ టైమ్ లో కాజల్ ను చూడలేకపోయారు. ఉన్న తక్కువ సన్నివేశాల్లో కూడా ఎక్కువ ప్రభావం చూపించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇంకా చెప్పాలంటే ఆమె హీరోయిన్ కు తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ అన్నట్టుంది. ఆమె పాత్రలో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం మరో పెద్ద మైనస్. కచ్చితంగా ఆమె రీఎంట్రీకి కలిసొచ్చే సినిమా కాదిది.

ఒకప్పుడు హీరోయిన్ కు పెళ్లయితే, కెరీర్ క్లోజ్ అనేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా హీరోయిన్లు కెరీర్ కొనసాగిస్తున్నారు. కానీ అలా కొనసాగాలంటే మంచి పాత్రలు, సాలిడ్ సినిమాలు పడాలి. అప్పుడే కెరీర్ మరికొన్నాళ్ల పాటు కొనసాగుతుంది. ఈ విషయంలో కాజల్ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది.