కాజల్ కు ఇష్టమైన హాలిడే స్పాట్ ఇదే

స్టార్స్, సెలబ్రిటీలకు ఏమాత్రం సమయం దొరికినా విదేశాలకు చెక్కేయాలని చూస్తుంటారు. చక్కగా ఓ 4 రోజుల పాటు విదేశాల్లో సేదతీరి తిరిగి షూటింగ్ స్పాట్ కు వచ్చేస్తుంటారు. అలా తనకు టైమ్ దొరికితే ఇండోనేషియాలోని…

స్టార్స్, సెలబ్రిటీలకు ఏమాత్రం సమయం దొరికినా విదేశాలకు చెక్కేయాలని చూస్తుంటారు. చక్కగా ఓ 4 రోజుల పాటు విదేశాల్లో సేదతీరి తిరిగి షూటింగ్ స్పాట్ కు వచ్చేస్తుంటారు. అలా తనకు టైమ్ దొరికితే ఇండోనేషియాలోని బాలికి వెళ్తానంటోంది కాజల్. తన ఆల్ టైమ్ ఫేవరెట్ స్పాట్ గా బాలిని చెప్పుకొచ్చింది.

“నా బెస్ట్ హాలిడే స్పాట్ బాలి. నా బెస్ట్ ఫ్రెండ్స్ దివ్య, ప్రియాంకతో కలిసి బాలీలో చేసిన హాలిడే ట్రిప్ నా ఫేవరెట్. కొత్త ఏడాదిలో మరిన్ని దేశాలు చుట్టేయాలని ఉంది. కనీసం 4-5 హాలిడే ప్లాన్స్ ఉన్నాయి.”

ఇలా తన బెస్ట్ హ్యాంగవుట్ ప్లేస్ ను బయటపెట్టింది కాజల్. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఒత్తిడి ఫీల్ అవ్వలేదంటోంది కాజల్. ఒత్తిడి ఫీల్ అయితే ఇండస్ట్రీలో నెగ్గుకురాలేమనేది కాజల్ అభిప్రాయం.

“నిజం చెప్పాలంటే కొన్ని సార్లు ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలాసార్లు ఫిజికల్ గా, కొన్ని సార్లు మెంటల్లీ ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నా ఫీల్డ్ లో అది తప్పనిసరి. కానీ నేను ఆ ఒత్తిడిని తట్టుకుంటాను. నాకు ఇది ఇష్టం కూడా.”

ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చెరో సినిమా చేస్తోంది కాజల్. ప్రస్తుతానికైతే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని, మరిన్ని మంచి సినిమాలు చేస్తానని అంటోంది.

ఇదే నా చివరి ల‌వ్ స్టోరి సినిమా