కాజల్.. జీవిత కాలం లేటు

గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత భర్త గౌతమ్ తో కలిసి హనీమూన్ కూడా పూర్తిచేసింది. తర్వాత సినిమా సెట్స్ పైకి కూడా వచ్చింది. మధ్యలో కొత్త బిజినెస్ స్టార్ట్…

గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత భర్త గౌతమ్ తో కలిసి హనీమూన్ కూడా పూర్తిచేసింది. తర్వాత సినిమా సెట్స్ పైకి కూడా వచ్చింది. మధ్యలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఓటీటీలో  కూడా అడుగుపెట్టింది. ఇన్నాళ్ల తర్వాత తనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన ఓ వ్యక్తికి తాజాగా థ్యాంక్స్ చెప్పింది కాజల్. ఆ వ్యక్తి కూడా సామాన్యురాలు కాదు. ఆమె టాలీవుడ్ హీరోయిన్ అనుష్క.

కాజల్ పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆమె పెళ్లి చేసుకున్న మరుసటి రోజే అనుష్క ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. పెళ్లికి సంబంధించి పెద్ద కొటేషన్ పెట్టి మరీ కాజల్ ను విష్ చేసింది. ఆమెను ట్యాగ్ చేసింది కూడా. అలా అనుష్క శుభాకాంక్షలు చెప్పిన 7 నెలలకు కాజల్ స్పందించింది. ఈరోజు రిప్లయ్ ఇచ్చింది. ఓ 3 లవ్ సింబల్ ఎమోజీలు తగిలించి థ్యాంక్స్ చెప్పింది.

కాజల్ చేసిన ఈ పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో వరుసగా ఆమెపై కామెంట్లు పడుతున్నాయి. కాజల్ జీవిత కాలం లేట్ అంటూ కొందరు సెటైర్లు వేస్తే, పిల్లలు పుట్టిన తర్వాత రిప్లయ్ ఇస్తే బాగుండేదని మరికొందరు జోకులేశారు.

గతేడాది లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న కాజల్, అనుష్కకు రిప్లయ్ ఇవ్వడానికి మరో లాక్ డౌన్ రావాల్సి వచ్చిందంటూ మరికొందరు పంచ్ లేస్తే.. ఇంకో 5 నెలలు ఆగితే వివాహ వార్షికోత్సవం వస్తుంది కదా, అప్పుడు రిప్లయ్ ఇవ్వాల్సిందంటూ ఇంకొందకు సెటైర్లు వేశారు.

ఈ వ్యవహారంపై కొందరు మాత్రం సీరియస్ గా స్పందించారు. ఇలా 7 నెలలు ఆలస్యంగా అనుష్క పోస్టుపై స్పందించే బదులు.. ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబితే సభ్యతగా ఉండేదంటూ సలహా ఇచ్చారు. 

ఇంతకీ సమస్య ఎక్కడొచ్చిందంటే.. అనుష్కది వెరిఫైడ్ ఎకౌంట్ కాదు, టిక్ మార్క్ లేకపోవడంతో కాజల్ పొరపడింది. బహుశా.. ఇన్నాళ్లకు అది అనుష్క అధికారిక ట్విట్టర్ ఖాతా అనే విషయాన్ని కాజల్ గ్రహించి ఉంటుంది.