కాజల్ నటించిన పారిస్ పారిస్ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. అందులో ఉన్న అడల్ట్ కంటెంట్, బూతు పదాల కారణంగా ఏకంగా 25 కట్స్ సూచించింది తమిళనాడు సెన్సార్ బోర్డు. దీనిపై కాజల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందీలో ఉన్న సినిమాను తమిళ్ లో ఉన్నది ఉన్నట్టు తీస్తే సెన్సార్ కట్స్ ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదంటోంది.
“పారిస్-పారిస్ లాంటి సినిమాకు సెన్సార్ సమస్యలు రావడం ఆశ్చర్యంగా ఉంది. పూర్తిగా నాకు తెలీదు కానీ చాలా పెద్ద సమస్యలు వచ్చాయని విన్నాను. హిందీ వెర్షన్ ను యాజ్ ఇటీజ్ తీశాం. అదనంగా ఏదీ పెట్టలేదు. కానీ ఎందుకు సమస్య వచ్చిందో అర్థంకాలేదు. బహుశా తమిళ సెన్సార్ బోర్డు నిబంధనలు అలా ఉన్నాయేమో.”
తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో లేని సెన్సార్ సమస్యలు తమిళ వెర్షన్ కే ఎందుకొస్తున్నాయో అర్థంకావడం లేదంటోంది కాజల్. ప్రస్తుతం నిర్మాతలు ఈ వివాదంపై చాలా సీరియస్ గా ఉన్నారని రివ్యూ కమిటీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారని స్పష్టంచేసింది.
“ఈ సినిమాను 4 భాషల్లో రీమేక్ చేశారు. గమ్మత్తుగా మిగతా 3 భాషల్లో ఎలాంటి సెన్సార్ కట్స్ లేవు. కేవలం తమిళ వెర్షన్ కే సెన్సార్ కట్స్ ఇచ్చారు. ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థంకావడం లేదు. ప్రస్తుతం నిర్మాతలు ఆ పనిమీదే ఉన్నారు. రివైజింగ్ కమిటీకి వెళ్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.”
కాజల్ ఇలా పైకి కవరింగ్ ఇస్తూ మాట్లాడుతున్నప్పటికీ.. అందులో ఆమె బోల్డ్ గా నటించిందనే విషయం అందరికీ తెలిసిందే. పారిస్-పారిస్ లో కాజల్ పై కొన్ని బోల్డ్ సీన్స్ తీయడంతో పాటు కొన్ని అభ్యంతరకర పదాల్ని కూడా వాడారు. వీటిలో ఆమె బాత్ రూమ్ లో దుస్తులు మార్చుకునే సీన్ కూడా ఒకటి. ఇవేవీ మిగతా వెర్షన్స్ లో లేవు.
కాబట్టి వాటికి సెన్సార్ సమస్యలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా తనకేం తెలియదన్నట్టు అమాయకంగా సమాధానాలిస్తోంది కాజల్. రణరంగం ప్రమోషన్ లో భాగంగా ఈరోజు మీడియా ముందుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.