Advertisement

Advertisement


Home > Politics - Gossip

చిడతలు వాయించే వాళ్లతోనే చిక్కులన్నీ!

చిడతలు వాయించే వాళ్లతోనే చిక్కులన్నీ!

చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఓటమిని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ‘ఎందుకు ఓడిపోయాం’ అనే విషయాన్ని తెలుసుకోవడానికి పార్టీకి చెందిన నాయకులతో ఇప్పటికీ సమావేశాలు పెడుతున్నారు. అయితే తమాషా ఏంటంటే... ఓటమిపూర్తయి నెలలు గడుస్తున్నా.. పార్టీని తిరిగి ఉత్తేజితం చేయాల్సిన అవసరం కళ్ల ఎదుట కనిపిస్తూనే ఉన్నా.. నాయకులు ఇంకా ఆయనతో నిజాలు మాట్లాడడం లేదు. ఇంకా చిడతలు వాయిస్తూ ఆయనను మభ్యపెట్టే పనిలో ఉన్నారు.

శుక్రవారం నాడు కూడా.. చంద్రబాబునాయుడు అమరావతిలో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. పార్టీనుంచి, పాలిట్ బ్యూరోనుంచి, ‘పోగా మిగిలినవాళ్లు’ ఆ భేటీకి వచ్చారు. వారితోనే ఓటమికి దారితీసిన కారణాలను సమీక్షించుకున్నారు. అయితే వారు ఇప్పటికీ నకిలీ కారణాలను ఆయన ముందు పెడుతుండడమే చిత్రం. సీట్ల ఎంపికలో కులాల మధ్య పంపకాలు సరిగా జరగలేదని, బీసీలు మాదిగలు దూరమయ్యారని... ఒకరు అంటే.. రాష్ట్రం అభివృద్ధి కోసం గత అయిదేళ్లుగా చంద్రబాబు పడిన కష్టాలన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారట.

ఈ రేంజిలో నాయకులు చంద్రబాబు ఎదుట చిడతలు వాయిస్తున్నారు. ఒకరు మీటింగులోనే ఏడ్చేసి రక్తి కట్టిస్తోంటే.. మరొకడు.. రాష్ట్రం మొత్తం ఏడుస్తున్నదంటూ... రసపుష్టి చేకూరుస్తున్నారట. ఔరా.. ఈ నాయకులు ఎంతకైనా సమర్థులే అనిపిస్తోంది. వీరి వైనం చూస్తోంటే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అప్పుడే రెండున్నర నెలలు కూడా పూర్తికాలేదు.. అప్పుడే జనానికి పూర్తిగా ఆయన పాలన పట్ల రోత పుట్టేసి, ఎందుకు అతనికి ఓట్లేసి గెలిపించామా? అని తమను తామే నిందించుకుని, చంద్రబాబు పడిన కష్టాలను తలచుకుని దుఃఖిస్తున్నారని అనుకుంటూ వారు తమని తాము మోసం చేసుకోవడం చూస్తే వీళ్లు ఎంతటి అజ్ఞాన అగాథాల్లో ఉన్నారా? అనిపిస్తుంది.

చంద్రబాబునాయుడు ఎందుకు ఓడిపోయాడని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసిపిల్లవాడిని అడిగినా చెప్తారు. కొండవీటి చేంతాడంత పెద్ద లిస్టు కారణాలు ఉన్నప్పటికీ మచ్చుకు రెండుచాలు. కేంద్రంతో బంధం విషయంలో తీసుకున్న అనేకానేక యూటర్న్ లు.. కంప్యూటర్ తెరలు, కలర్ ప్రింటవుట్లలో తప్ప, రాజధాని విషయంలో చేతగానితనం చాలు. ప్రజలకు ఆయన సీనియారిటీ మీద నమ్మకం స్థానే అసహ్యం పుట్టించాయి. కనీసం ఆ కారణాలను వారు గుర్తించకుండా, తమపద్ధతి మార్చుకోకుండా.. ఇలా నాయకుడి ముందు సహచరులు చిడతలు వాయిస్తుండగా.. ఆయన కూడా ఆ చిడతల సంగీతాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంటే.. ఇంకాస్త పాతాళానికి పోతారు.

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?