కల్కి సెన్సార్ ఫార్మాలిటీ పూర్తయింది. బాహుబలి తరువాత ప్రభాస్ కు దొరికిన రెండో నమ్మకమైన దర్శకుడు నాగ్ అశ్విన్. సలార్ కు ప్రశాంత్ నీల్ మినిమమ్ భరోసా ఇచ్చారు. అదే నిజమైంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ మీద కూడా అదే భరోసా వుంది.
దగ్గర దగ్గర మూడు గంటల సినిమాగా కల్కి రాబోతోంది. మూడు నాలుగు నిమిషాలు తక్కువ. సెన్సార్ కు టెక్నికల్ గా రఫ్ కాపీ ఇవ్వడం అన్నది టాలీవుడ్ లో మామూలే. కానీ కంటెంట్ తెలుస్తుంది. ఆ మేరకు రకరకాల టాక్ లు బయటకు వస్తాయి.. వస్తున్నాయి.
సినిమా తొలిసగం అంతా కథ, ఆ కొత్త ప్రపంచం, భూమి తీరు తెన్నులు, ఇవన్నీ ఎస్లాబ్లిష్ చేస్తారని వినిపిస్తోంది. మలిసగం అంతా రేసీగా, మాస్ టచ్ తో నడుస్తుందని తెలుస్తోంది. అందువల్ల సెకండాఫ్ అంతా ఫుల్ జోష్ తో వుంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఎంటర్ టైన్ ను, ఫన్ ను బాగా పండించారని, సినిమాలో ఎమోషన్ టచ్ తో పాటు ఈ ఎంటర్ టైన్ మెంట్ అన్నది సినిమాకు ప్లస్ గా వుంటుందని వినిపిస్తోంది.
సినిమాలో మొత్తం నాలుగు పాటలు వుంటాయని, ఒకటి టైటిల్స్ మీద వస్తుందని తెలుస్తోంది. సినిమాకు టెక్నికల్ వాల్యూస్ బాగా సెట్ అయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా విజువల్స్ బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.