కల్కి ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినిమా కల్కి2898AD. జూన్ 27న విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఈనెల 22న రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్…

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినిమా కల్కి2898AD. జూన్ 27న విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఈనెల 22న రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో, సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి, రూపొందించిన కారు ను ఆవిష్కరించబోతున్నారు, ఇది కారు కాదు, బుజ్జి అనే కీలకమైన క్యారెక్టర్ అంటున్నారు మేకర్లు.

ఈ మేరకు ఇప్పటికే ఓ ప్రోమో వీడియో విడుదల చేసారు. అది చాలా ఆసక్తి కలిగించింది. ఇప్పుడు ఆ వాహనాన్ని జనం ముందుకు తీసుకురావడం అంటే సినిమాకు మంచి బజ్ తీసుకురావడమే అవుతుంది.

కల్కి సినిమా కథేంటీ, ఎలా వుండబోతోందీ అన్నది ఇప్పటి వరకు వన్ పర్సంట్ కూడా క్లారిటీ లేదు. అప్ డేట్ లేదు. ఇదే తొలి ఈవెంట్ కాబట్టి, దర్శకుడు నాగ్ అశ్విన్ కొద్దిగా అయినా సినిమా గురించి, పాత్రల గురించి, నటుల గురించి రివీల్ చేస్తారని ఫ్యాన్స్, సినిమా అభిమానులు ఆశిస్తున్నారు.

టోటల్ యూనిట్ వస్తుంది కనుక సినిమా స్పాన్ మీద మరింత క్లారిటీ వస్తుంది. కల్కి సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్, దీపిక, దిశ పటానీ ఇలా చాలా పెద్ద స్టార్ కాస్ట్ వుంది కనుక, వాళ్లంతా ఫంక్షన్ కు హాజరయ్యే అవకాశం వుంది. అంటే ఈవెంట్ ఓ రేంజ్ లో వుంటుంది అప్పుడు. కచ్చితంగా ఈ ఈవెంట్ సినిమా బజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుందనే అనుకోవాలి.