సినిమా అభిమానుల ఎదురు చూపులు పూర్తయ్యాయి. ట్రయిలర్ వచ్చేసింది. అందరూ అర్జంట్ గా, పోటా పోటీగా అహో అనేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా అవలోకిద్దాం. ట్రయిలర్ మీద కొంత మిక్స్ డ్ ఒపీనియన్ వినిపిస్తోంది టాలీవుడ్ లో. అయితే రాజుగారి దేవతావస్త్రాలు అన్నట్లుగా ఎవ్వరూ పైకి మాట్లాడడం లేదు. పలువురు నిర్మాతలు, దర్శకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్న మాటలు వేరుగా వున్నాయి.
నాగ్ అశ్విన్ ఇమాజినేషన్ వరకు బాగుంది. కానీ ట్రయిలర్ లో ఏదో సోల్ మిస్సయింది అన్నది ఒక కామెంట్.
కాన్వాస్ బాగుంది. కానీ సింగిల్ టోన్ తో వుండడం వల్ల సింగిల్ స్క్రీన్స్ లో మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
హీరో క్యారెక్టర్ ను ఇంకా బాగా చూపించాల్సింది. లైటర్ వీన్ లో చూపించడం వరకు ఓకె. ఒక్కటైనా సరైన పెరోషియస్ షాట్ వేయాల్సింది. అలాగే హీరోయిన్ టోటల్ గా శాడ్ మూడ్ లోనే చూపించారు.
కాన్వాస్ ఇమేజినేషన్ బాగుంది. కానీ టెక్నికల్ క్వాలిటీ ఇంకా అప్ టు ది మార్క్ లేదు. బాహుబలి లాంటి సినిమాలు కలర్ ఫుల్ గా వుండి అందరినీ ఇట్టే ఆ లోకంలోకి తీసుకెళ్లిపోతాయి. కానీ ఇక్కడ 2 డి యానిమేషన్ మాదిరిగా, అలాగే సింగిల్ టోన్ వల్ల ఆ లోకాన్ని ఆస్వాదించే ఫీల్ రావడం లేదు. కొన్ని చోట్ల వైట్ బ్యాక్ గ్రవుండ్ వదిలేయడం, లైట్ గ్లేర్ వంటి షాట్ లు వుండడం వల్ల
సినిమాకు అయిదారు వందలు ఖర్చయింది అంటున్నారు కానీ ట్రయిలర్ సిజి వర్క్ చూస్తుంటే అలా అనిపించడం లేదు.
బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చాలా బాగుంది.
ఓవరాల్ గా అందరూ అంగీకరిస్తున్నది దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ అద్భుతంగా వుంది అని. కానీ టెక్నికల్ గా అప్ టు ది మార్క్ లేదు అన్నది, ట్రయిలర్ లో ఓ ఫీల్ కానీ సోల్ కానీ లేదు అన్నది ఎక్కువ మంది చెబుతున్న మాట.