ఈమధ్య కాలంలో కల్కి సినిమాపై వచ్చినన్ని పుకార్లు మరే సినిమాపై రాలేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. కొన్నింటిపై క్లారిటీ ఇచ్చిన యూనిట్, మరికొన్ని పుకార్లను లైట్ తీసుకుంటోంది. తాజాగా ఈ సినిమాపై మరో రూమర్ మొదలైంది.
కల్కి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకోన్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. తను ప్రెగ్మెంట్ అయ్యానంటూ దీపిక స్వయంగా ప్రకటించింది. దీంతో కల్కి సినిమా మరింత ఆలస్యం అవుతుందని కొందరు, దీపిక పోర్షన్ ను కొంత కట్ చేసి ఉంటారని మరికొందరు తమకిష్టమొచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
అయితే అసలు మేటర్ ఏంటంటే, కల్కి సినిమాకు సంబంధించి దీపిక పదుకోన్ నటించాల్సిన మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తయింది. ఇంకా చెప్పాలంటే, ఆమెపై తీయాల్సిన కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఆమె త్వరలోనే పూర్తి చేయబోతోంది. అంతేకాదు, కల్కి ప్రచారానికి కూడా ఆమె హాజరవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమా కోసం విదేశాల్లో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్, దిశా పటానీ కాంబినేషన్ లో ఈ సాంగ్ తెరకెక్కుతోంది. అటు దీపిక పదుకోన్ మాత్రం ప్రస్తుతం సెట్స్ పై లేదు. ఆమె తన భర్తతో కలిసి అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు జామ్ నగర్ వెళ్లింది.