కల్కి.. కల్కి.. కల్కి

ఈ నెల 27న జంటనగరాల్లోని దాదాపు అన్ని సినిమా స్క్రీన్ లు ఒకే సినిమాతో నిండిపోబోతున్నాయి. కల్కి నామ జపం చేయబోతున్నాయి. ఎన్ని స్క్రీన్ లు వుంటే అన్ని ఇంటూ ఆరు వంతున షో…

ఈ నెల 27న జంటనగరాల్లోని దాదాపు అన్ని సినిమా స్క్రీన్ లు ఒకే సినిమాతో నిండిపోబోతున్నాయి. కల్కి నామ జపం చేయబోతున్నాయి. ఎన్ని స్క్రీన్ లు వుంటే అన్ని ఇంటూ ఆరు వంతున షో లు పడబోతున్నాయి. ఏడేసి స్క్రీన్ లు వున్న మల్టీ ఫ్లెక్స్ లు తొలి రోజు 42 వంతున షో లు వేస్తున్నాయి. అన్ని పివిఆర్ లు, ఐనాక్స్ లు, ప్రతి ఒక్కటీ మరో సినిమా ఏదీ ప్రదర్శించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రన్నింగ్ లో మహరాజ తప్ప మరో సినిమా ఏదీ లేదు.

టికెట్ లకు డిమాండ్ కూడా అలాగే వుంది. ముఖ్యంగా ఎఎంబి, ప్రసాద్స్ లాంటి స్క్రీన్ లకు ఫోన్ ల తాకిడి ఎక్కువగా వుంది. అన్ని మల్టీ ఫ్లెక్స్ ల్లో తెల్లవారుఝామున అయిదు గంటల నుంచి పదేసి నిమిషాల గ్యాప్ లో నాలుగు నుంచి ఏడు షో లు వేస్తున్నారు. త్రీడీ కి కొన్ని స్క్రీన్ లు, 2డి కి కొన్ని స్క్రీన్ లు కేటాయిస్తున్నారు. ప్రసాద్స్ బిగ్ స్క్రీన్ లో కూడా కల్కి అయిదు గంటల స్పెషల్ షో వేస్తున్నారు.

మొత్తం మీద హైదరాబాద్ జంట నగరాల్లో కల్కి ఫీవర్ కనిపిస్తోంది. తొలి రోజు వసూళ్లు 20 కోట్ల వరకు వుంటాయని, వుండాలని అంచనా వేస్తున్నారు. కల్కి సినిమాను నైజాం ఏరియాకు 65 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ కు తీసుకుంది ఆసియన్ సినిమాస్ సంస్థ.

ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్, దీపిక పడుకొనె, పశుపతి, ఇలా భారీ స్టార్ కాస్ట్ వుందీ సినిమాలో. నాగ్ అశ్విన్ దర్శకుడు.