టాలీవుడ్ నోటెడ్ నిర్మాతలు రేపు అమరావతికి బయల్దేరి వెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి, తన పార్టీని విజయ పథంలో నడిపించి మూడు శాఖలకు మంత్రిగా మారిన పవన్ కళ్యాణ్ ను అభినందించేందుకు అశ్వనీదత్, డివివి దానయ్య, నవీన్, రవిశంకర్, దిల్ రాజు, దామోదరప్రసాద్, చినబాబు, నాగవంశీ తదితరులు బయల్దేరి వెళ్తున్నారు.
కల్కి సినిమాకు అదనపు రేట్లు, అదనపు ఆటల కోసం దరఖాస్తు చేసారు. ఆ ఆదేశాలు ఎలాగూ రేపు వస్తాయి. ఈ సందర్భంగా వెళ్లినట్లు వుంటుంది. పవన్ ను కలిసి అభినందనలు తెలియచేసినట్లు వుంటుంది అని అంతా కలిసి వెళ్తున్నారు. పనిలో పనిగా థియేటర్ల సమస్యలు, టికెట్ రేట్లు ఇతర విషయాలను చర్చించే అవకాశం వుంది.
ఇండస్ట్రీ సమస్యలు పవన్ కు తెలియంది కాదు. ఆయన కూడా స్వయంగా నిర్మాతే. అలాగే ఆంధ్రలో జగన్ టైమ్ లో టికెట్ రేట్లు బాగా తగ్గించారు. అయినా మల్టీ ఫ్లెక్స్ ల విషయంలో అందుబాటులో లేవని జనం అనుకుంటూనే వున్నారు.
ఇలాంటి టైమ్ లో మరి టికెట్ రేట్లు పెంచమంటారో? లేక పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్,ఇలాంటి సరిహద్దుల విషయంలో మార్పులు చేయమంటారో, మొత్తం మీద పవన్ కు విన్నవించిన తరువాత తెలుస్తోంది.
కొసమెరుపు ఏమిటంటే బయటకు వచ్చిన జాబితాలో అల్లు అరవింద్ పేరు లేదు..జనసేనలో కీలకంగా వుండే బన్నీ వాస్ పేరు లేదు