శ్రీవిష్ణు లేడీ గెటప్ లో కూడా నటించిన వైవిధ్యమైన సినిమా స్వాగ్. చిత్ర విచిత్రమైన పాత్రలు, పబ్లిసిటీతో హడావుడి చేస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మించింది. త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. సామజవరగమన తరువాత ఓం భూమ్ బుష్ ఓ మాదిరిగా నడిచింది. ఇప్పుడు స్వాగ్ కు మాత్రం ఎందుకో మార్కెట్ లో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు థియేటర్ హక్కులు మొత్తం విక్రయించేసారు.
మూడు పార్టీల పోటీలో ఈ డీల్ ను ఆసియన్ సినిమాస్ క్లోజ్ చేసింది. 9 కోట్ల రూపాయలకు ఇండియా వైడ్ థియేటర్ హక్కులు, శ్రీవిష్ణు సినిమాకు క్లోజ్ కావడం అంటే చాలా మంచి డీల్ నిర్మాతకు. అదే సంస్థ ఇటీవల నిర్మించిన శర్వానంద్ సినిమాను థియేటర్లలో నేరుగా విడుదల చేసుకున్న సంగతి తెలిసిందే.
శ్రీవిష్ణ ఈ స్వాగ్ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అందులో లేడీ గెటప్ ఒకటి అని తెలుస్తోంది. ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్, యంగ్ ఏజ్ క్యారెక్టర్ ఇలా రకరకాలు వున్నాయి సినిమాలో. సినిమాలో నిత్యమీనన్ కీలకపాత్రలో నటించింది.