ఎప్పుడో కానీ మన హీరోలకు పూనకం రాదు. అలా వచ్చింది అంటే మరింకేం చూడరు. ఈ రోజు ధమాకా సినిమా నుంచి ఓ పాట బయటకు వచ్చింది. రవితేజ, శ్రీలీల చిందేసిన ‘దండకడియాలు’ పాట ఇది. ఫుల్ మాస్ నెంబర్. పుల్ మాస్ స్టెప్స్.
ఈ పాట లిరికల్ వీడియో చూసిన వారు శ్రీలీల ఎనర్జీ లెవెల్స్ చూసి కాస్త ఆశ్చర్యపోవడం ఖాయం. అయితే ఇరవై ఏళ్ల శ్రీలీల ఎనర్జీ లెవెల్స్ ను మ్యాచ్ చేస్తూ సీనియర్ హీరో రవితేజ డ్యాన్స్ చేయడం కూడా ఆశ్చర్యమే.
ఇక్కడే ఒక గమ్మత్తైన విషయం వుంది. ఈ పాట చిత్రీకరణకు అంతా రెడీ అయింది. భారీ సెట్ అంతా సిద్దం. కానీ ఒకటి రెండు రోజుల ముందే వేరే సినిమా షూట్ లో చిన్న ప్రమాదం. క్రేన్ కు వున్న ఓ ఇనుపచువ్వ రవితేజ మోకాలి దగ్గర నుంచి పాదం వరకు గీసేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కట్లు కట్టారు. ఇక పాట చిత్రీకరణ వాయిదానే అనుకున్నారు. సెట్ వ్యయం సంగతి సరేసరి.
కానీ రవితేజకు ఈ పాట మీద చాలా ఆసక్తి వుంది. అందుకే ఏం పరవాలేదు రెడీ అన్నాడు. చేసేసాడు. జానీ మాస్టర్ డ్యాన్స్ డైరక్షన్ . ఇప్పుడు ఈ పాటను చూసిన వారు రవితేజ కాలికి గట్టి గాయంతో ఈ పాట చేసాడు అంటే నమ్మలేరు. ధమాకా పాటల్లో డ్యాన్స్ లతో శ్రీలీల మరో మెట్టు ఎక్కడం ఖాయం అంటున్నారు రసెష్ చూసిన వాళ్లు. పెళ్లి సందడి తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇది.