‘కళ్యాణమండపం’ కళకళ

కరోనా రెండోదశ అనంతరం విడుదలై, టాలీవుడ్ లో కదలిక తెచ్చిన సినిమా ఎస్ ఆర్ కళ్యాణమండపం. మంచి రేట్లకు అమ్ముడుపోయిన చిన్న సినిమాగా మాత్రమే కాకుండా, మంచి లాభాలు అందించే తొలి సినిమాగా పేరు…

కరోనా రెండోదశ అనంతరం విడుదలై, టాలీవుడ్ లో కదలిక తెచ్చిన సినిమా ఎస్ ఆర్ కళ్యాణమండపం. మంచి రేట్లకు అమ్ముడుపోయిన చిన్న సినిమాగా మాత్రమే కాకుండా, మంచి లాభాలు అందించే తొలి సినిమాగా పేరు తెచ్చుకుంది. అంతే కాదు ఈ ఊపు చూసి వరుసగా చిన్న సినిమాలు క్యూ కట్టేలా చేసింది. 

ఈ నేపథ్యంలో ఎస్ ఆర్ కళ్యాణమండపం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రమోద్,రాజులు మాట్లాడుతూ .. చూసిన ప్రతి తండ్రి, కొడుకులు మా సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడం తో నిన్నటి నుండి మరిన్ని థియేటర్స్ పెంచాము. 

నాకు ఇష్టమైన నటుడు సాయికుమార్ గారి సపోర్ట్ మరవలేము. భవిష్యత్తు లో కిరణ్ తో మరిన్ని సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాము. మాకింత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ …ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరి సహకారంతో పాటలు చాలా బాగా వచ్చాయి అని అన్నారు. 

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ. 25 సంవత్సరాల క్రితం కథను నమ్ముకొని చేసిన  పోలీస్ స్టోరీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఆ తరువాత అంతే పెద్ద హిట్ అయిన సినిమా  “SR కళ్యాణమండపం EST 1975.. ఇది నాకు సెకెండ్ ఇన్నింగ్స్ లాంటిది. చాలా చోట్ల నుండి సినిమా చాలా బాగుందని ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమా ఒక విజయం శుభ సూచికం లాంటిది. ఈ సినిమా తరువాత చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి పెద్ద విజయం అందించారు అని అన్నారు. 

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ..  థియేటర్స్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, అందరూ ఈ కరోనా పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నమ్మి మా సినిమా విడుదల చేసినందుకు పేరు పేరు న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మా సినిమా ద్వారా మరోసారి నిరూపించారు.. మా సినిమా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా టీం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.