Advertisement

Advertisement


Home > Movies - Movie News

మ‌రోసారి ఆస్ప‌త్రిలో చేరిన విల‌క్ష‌ణ న‌టుడు ...

మ‌రోసారి ఆస్ప‌త్రిలో చేరిన విల‌క్ష‌ణ న‌టుడు ...

భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క‌మ‌ల్‌హాస‌న్‌ది విశిష్ట పాత్ర‌. త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో యావ‌త్ ప్ర‌పంచ‌మంతా ఆయ‌న అభిమానుల్ని సంపాదించుకున్నారు. రాజ‌కీయంగా ఆయ‌న అభిప్రాయాలు, సిద్ధాంతాలు, ఇత‌ర‌త్రా ఏవైన‌ప్ప‌టికీ, న‌టుడిగా ఆయ‌న్ను మెచ్చుకోని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.

అలాంటి గొప్ప న‌టుడైన క‌మ‌ల్‌హాస‌న్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి ఆస్ప‌త్రిపాలు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌నకు ఏమైందో అనే ఆందోళ‌న క‌మ‌ల్ అభిమానుల్లో క‌నిపిస్తోంది. కొంత కాలం క్రితం క‌మ‌ల్‌హాస‌న్‌ క‌రోనాబారిన ప‌డి ఆస్ప‌త్రిపాల‌య్యారు. అనంత‌రం ఆయ‌న కోలుకున్నారు.  

అంతా బాగుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో మ‌రోసారి ఆయ‌న ఆస్ప‌త్రిపాల‌య్యారే వార్త చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఉలికిపాటుకు గురి చేస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోని ప్ర‌ముఖ శ్రీ‌రామ‌చంద్ర ఆస్ప‌త్రిలో చేరారు. 

అభిమానులు ఆందోళ‌న చెందాల్సిందేమీ లేద‌ని, జ‌న‌ర‌ల్ చెక‌ప్‌లో భాగంగానే క‌మ‌ల్‌హాస‌న్ ఆస్ప‌త్రికి వెళ్లార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఇదిలా వుండ‌గా త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్ 5 కు ఆయ‌న హోస్ట్‌గా చేస్తున్నారు. గ‌త ఆదివారం ఫినాలే కూడా పూర్త‌యింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?