అంతా అనుకుంటూనే వున్నారు. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా కోర్టు మెట్లు ఎక్కక తప్పదని. ఎవరో ఒకరు కేసు వేస్తారని. ఇప్పుడు ఫస్ట్ కేస్ దాఖలైంది. మత ప్రబోధకుడు కేఎ పాల్ పిటిషన్ దాఖలు చేసారు.
కమ్మరాజ్యం లో కడప రెడ్లు సినిమా లో తనను అవమానించేలా కొన్ని చిత్రం లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో తన పాత్రను అవమానించేలా తీశారని ఆయన ఆరోపించారు. దీని వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని, ఈ సినిమాను నిలుపుదల చేయాలని ఆయన హైకోర్టులో దావా వేశారు.
దీనిపై హైకోర్టు కేంద్ర ప్రసార శాఖకు, సెన్సార్ బోర్డుకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసు విచారణ గురువారం జరగవచ్చని వార్తలు వచ్చాయి.
ఇందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ తదితరుల పాత్రలతో ఈ సినిమా తీశారు.