కంగనా రనౌత్ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఇప్పుడు ఓ నియోజకవర్గానికి ఎంపీ. పైగా రూలింగ్ పార్టీ. ఇలాంటి వ్యక్తికి కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషిస్తూ ఎమర్జెన్సీ అనే సినిమాను తీసింది కంగనా. ఇందులో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు సంబంధించి అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని, అయినప్పటికీ తనకు బెదిరింపులు ఆగడం లేదని చెప్పుకొచ్చింది.
“నా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది. నలుగురు చరిత్రకారులు నా సినిమాను చూసి ఓకే చెప్పారు. అన్ని రకాల పత్రాలు, సినిమాలో సన్నివేశాలకు సంబంధించి చారిత్రక ఆధారాలు సిద్ధంగా ఉన్నాయి. నా సినిమాలో ఎలాంటి తప్పు లేదు. కానీ కొంతమంది నా సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారు.”
మరణించిన ఖలిస్థానీ ఉద్యమ నేత భింద్రన్ వాలేను కొంతమంది దైవదూతగా చూస్తున్నారని, కానీ అతడు ఒక ఉగ్రవాది అని ఆరోపించింది కంగన. అలాంటి వాళ్లు తన సినిమాకు వ్యతిరేకంగా కేసులు వేస్తున్నారని అన్నారు.
3 రోజుల కిందట కూడా ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయమని, కానీ కొన్ని సమస్యల్ని పరిష్కరించుకున్న తర్వాతే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. సొంత డబ్బులు పెట్టి ఎమర్జెన్సీ సినిమా తీశానని, అందుకే ఇష్టం లేకపోయినా ముంబయిలో ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.
Mundhu movie ni release cheyandi andhariki nijalu theliyali
vc available 9380537747
అందుకే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేయడం బెటర్