గేమ్ ఛేంజర్.. డిసెంబర్? మార్చి?

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా పరిస్థితి ఏమిటి? విడుదల ఎప్పుడు? కనీసం రెండో పాట ఎప్పుడు వస్తుంది?…

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా పరిస్థితి ఏమిటి? విడుదల ఎప్పుడు? కనీసం రెండో పాట ఎప్పుడు వస్తుంది? అన్నది తెలియక ఫ్యాన్స్ కిందా మీదా అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో క్రిస్మస్ కు పక్కాగా వస్తుందని నిర్మాత దిల్ రాజు చాలా నమ్మకంగా ఒకటి రెండు వేదికల మీద ప్రకటించి వున్నారు. కానీ ఎక్కడా ఇంత వరకు ఓ డేట్ పోస్టర్ మాత్రం పడలేదు.

ఇదిలా వుంటే త్వరలో రెండో పాట విడుదల చేస్తామని వినాయకచవితి సందర్భంగా ప్రకటించారు. కానీ ఈ ప్రకటనలో కూడా పాట విడుదల ఎప్పుడు అన్నది లేదు. సినిమా విడుదల ఎప్పుడు అన్నది లేదు.

దర్శకుడు శంకర్ మొండి మనిషి. తన పని, తన ధోరణి తనదే తప్ప మిగిలినవి పట్టవు. శంకర్ చెబితే మిగిలిన వారు వినాలి తప్ప, మిగిలిన వాళ్లు అడిగితే శంకర్ నుంచి సమాధానం రాదు అన్నది ఇండస్ట్రీ టాక్.

ఇలాంటి నేపథ్యంలో అసలు సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుందా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దిల్ రాజు నమ్మకం చూస్తే డిసెంబర్ లో వస్తుందని అనిపిస్తోంది. కానీ శంకర్ తీరు, రెండో పాట కూడా విడుదల చేయలేని పరిస్థితి చూస్తుంటే మార్చికి వాయిదా పడుతుందా? అనే అనమానం కలుగుతోంది. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో అయితే గేమ్ ఛేంజ‌ర్ మార్చ్ లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని వినిపిస్తోంది.

7 Replies to “గేమ్ ఛేంజర్.. డిసెంబర్? మార్చి?”

  1. అ లు.,…చ్చా శంకర గాడికి ఎందుకు సామి ఇంకా అవకసాలు ఇస్తున్నారు ?

    ఎప్పుడొ జమనాలొ కొన్ని మంచి సినిమాలు తిసాడు ..ఆ పెరు చెప్పి ఇంకా బతికెస్తున్నాడు

    1. Karma returns

      Tanu chesina papam tanane ventadutadi

      😂😂😂😂😂😂😂

      Ee chec gaadu NTR ki close ani natistadu

      Lekapothe okka comment kuda cheyyaledu Devara ki

      Musali nakka veedu iddaru nija jeevitham lo kuda natule

  2. Whever it comes, it is going to be a historic disaster and Ram Charan also will be forgotten if he does not concentrate on future. Look at Prabhas how fast and continuously he is doing different genres, For this disaster he has wasted at least 3 years and still looking at it.

    1. Evwn the Hollywood range director our churu tatayya is involved in this movie like he did in Acharya 😂😂😂😂😂

      Real life actors… Not good at heart so things happen this way

Comments are closed.