తన తొలి ముద్దు అనుభవాన్ని పబ్లిక్ గా వివరించింది కంగనా రనౌత్. బోల్డ్ గా మాట్లాడటం కంగనాకు కొత్త ఏమీకాదు. బాలీవుడ్ లో తను తీవ్రమైన వేధింపులకు గురైనట్టుగా కూడా కంగనా ఇదివరకే వివరించింది. అవి సెక్సువల్ వేధింపులు అని, ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు తనను వాడుకున్నారని కూడా ఆమె వాపోయింది. వారి పేర్లనూ చెప్పింది. అయినా వాళ్లూ చలామణిలోనే ఉన్నారు.
ఇక తాజాగా ఇండియాటుడే నిర్వహించిన కార్యక్రమంలో కంగనా తన తొలి డేట్, తొలిముద్దు అనుభవాలను చెప్పింది. తను పదిహేడేళ్ల వయసులో తొలిసారి డేటింగ్ చేసినట్టుగా కంగనా చెప్పింది. ఒక క్యూట్ పంజాబీ గాయ్ తో తను డేటింగ్ చేసినట్టుగా ఆమె వివరించింది. అప్పుడు తను చండీగడ్ లో ఉన్నట్టుగా పేర్కొంది.
ఇక తామిద్దరం ముద్దు కూడా పెట్టుకున్నట్టుగా చెప్పింది. అతడితో ముద్దు పెట్టుకోవడానికి ముందు తను తన అరచేతిని ముద్దు పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేసినట్టుగా వివరించింది. అంత ప్రాక్టీస్ తో వెళ్లినా.. తన తొలిముద్దు అంత గొప్పగా లేదని చెప్పింది.
అది మ్యాజికల్ కాదని వివరించింది. పైపెచ్చూ అదో చెత్త అనుభవంగా మిగిలిందని పేర్కొంది. చాలామంది చెప్పుకున్నట్టుగా తన తొలిముద్దు అంత గొప్పదని తను చెప్పుకోలేనని కంగనా చెప్పింది. అదో చెత్త అని వ్యాఖ్యానించింది.