మోడీ క్రెడిట్ ఆయనకే ఇస్తున్న జగన్!

కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంక్షేమ పథకాల క్రెడిట్ ను చాలావరకూ రాష్ట ప్రభుత్వాలు సొంతం చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లను తమ సొంత ఖాతాలో…

కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంక్షేమ పథకాల క్రెడిట్ ను చాలావరకూ రాష్ట ప్రభుత్వాలు సొంతం చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లను తమ సొంత ఖాతాలో వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్లు అంతా తామే చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకొంటూ వచ్చారు. ఆ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ఆక్షేపణలు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్  రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ ను దానికే ఆపాదిస్తున్నారు. అందులో భాగంగా 'రైతు భరోసా' పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతు భరోసా పథకంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులూ ఉన్నాయి, అదే సమయంలో కేంద్రం నిధులున్నాయి. సగం సగం వాటా కింద ఈ నిధులను భరిస్తున్నాయి ప్రభుత్వాలు.

సంవత్సరానికి ఒక్కో రైతుకు పన్నెండున్నర వేలరూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు ఈ పథకంలో. ఇందులో కేంద్రం వాటా ఆరువేల రూపాయలు. మిగిలిన సొమ్ము రాష్ట్రం వాటా. ఇలాంటి నేపథ్యంలో ఈ పథకాన్ని అంతా తమ క్రెడిట్ లోకి వేసుకోకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకం ప్రారంభానికే మోడీని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఆయన వస్తారో.. రారో.. కానీ, కేంద్రం వాటా సగం ఉన్న పథకం అమలు విషయంలో ఆ ప్రభుత్వ పెద్దను ఆహ్వానిస్తూ జగన్ ప్రభుత్వం సరైన చర్యనే చేపట్టిందని మాత్రం చెప్పవచ్చు.

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'