కాపులకు వర్మ నచ్చేస్తున్నాడు

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే పవన్ ఫ్యాన్స్ కు ముఖ్యంగా హార్డ్ కోర్ కాపు కమ్యూనిటీ అభిమానులకు భలే మంట. ఆర్ జి వి ఎప్పుడూ మెగా హీరోలను టార్గెట్ చేస్తాడని వీరి…

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే పవన్ ఫ్యాన్స్ కు ముఖ్యంగా హార్డ్ కోర్ కాపు కమ్యూనిటీ అభిమానులకు భలే మంట. ఆర్ జి వి ఎప్పుడూ మెగా హీరోలను టార్గెట్ చేస్తాడని వీరి బాధ. ఇలా కోపం పెట్టుకున్న వారిలో సామాన్యుల దగ్గర నుంచి మహా మేధావులం అని తమకు తామే అనుకునేవారి వరకు వున్నారు. 

ఇప్పుడు చిత్రంగా వీరందరికీ ఆర్జీవీ నచ్చేస్తున్నాడు. ఆంధ్రలో టికెట్ రేట్ల విషయంలో ఆర్జీవీ కాస్త అటు ఇటుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. తన సినిమాల పబ్లిసికి పనికి వస్తుందనో, అలాగే ఇటీవల టీవీ 5 మినహా మరెవరు పట్టించుకోవడం లేదనో, ఈ రూట్లోకి వచ్చారు. 

లేదా రఘురామ కృష్ణం 'రాజు' కు ఎలాగూ ఆంధ్ర ప్రభుత్వం పడదు కనుక రామ్ గోపాల్ 'వర్మ' కూడా అదే దారిలోకి వెళ్లారో. మొత్తానికి ప్రోడెక్ట్, ప్రొడక్షన్, కన్స్యూమర్ లాంటి అందరూ చేసే వాదనలనే ఆయన కూడా చేస్తున్నారు. 

దాంతో ఇక దాన్ని ఇప్పుడు కాపులు తలెకెత్తుకుంటున్నారు. ఎలాగూ తమ హీరో భీమ్లా నాయక్ సినిమా ఈ రేట్ల కారణంగానే పక్కన పడింది. లేదూ అంటే సంక్రాంతికి వచ్చేసేది. ఆ కోపం ఇప్పుడు ఇలా జగన్ కు వ్యతిరేకంగా, వర్మకు మద్దతుగా మారిపోయింది. 

మేధావులు కదా..ఎప్పుడు ఎలా మాట్లాడతారో వాళ్లకే తెలియదేమో?