అందుకే సెక్స్ సీన్స్ తగ్గించేశా

హీరోయిన్ కరీనా కపూర్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఒకప్పుడు హాట్ హీరోయిన్ ఇమేజ్ తో ఓ వెలుగు వెలిగింది బెబో. కానీ ఆ తర్వాత సెడన్ గా శృంగార సన్నివేశాల్లో నటించడం మానేసింది. ఇప్పుడా…

హీరోయిన్ కరీనా కపూర్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఒకప్పుడు హాట్ హీరోయిన్ ఇమేజ్ తో ఓ వెలుగు వెలిగింది బెబో. కానీ ఆ తర్వాత సెడన్ గా శృంగార సన్నివేశాల్లో నటించడం మానేసింది. ఇప్పుడా అంశంపై ఆమె స్పందించింది.

“ఒక కథను ముందుకు తీసుకెళ్లడానికి సెక్స్ ఒక్కటే ముఖ్యమని నేను అనుకోవడం లేదు. అలా అని అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇష్టం లేదని కూడా నేను చెప్పడం లేదు. నిజంగా అలాంటి శృంగారాన్ని చూపించాలనుకుంటే, అది కథలో ఓ ప్రాసెస్ లా ఉండాలి.”

ఇంత కష్టపడి, సన్నివేశం డిమాండ్ చేసిందని, ఎంతో శ్రద్ధగా అందులో నటించినప్పటికీ.. భారతీయ సమాజంలో ఆ సన్నివేశాన్ని చాలామంది మరోలా అర్థం చేసుకుంటారని, ఈ విషయంలో పాశ్చాత్య దేశాలంత ఓపెన్ గా భారతీయులు ఉండరని చెప్పుకొచ్చింది కరీనా.

“సెక్స్ విషయంలో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు ఇప్పటికీ అంత ఓపెన్ కాదు. ఓ సన్నివేశంలో శృంగారాన్ని విదేశీ నటీనటులు, ప్రేక్షకులు అనుభూతి చెందినంతగా మేమింకా ఓపెన్ అవ్వలేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో స్త్రీల కోరికలు ఓపెన్ గానే ఉంటాయి. తెరపై కూడా వాటిని అలానే చూపిస్తారు.”

ఫిదా, ఓంకార, కుర్బాన్ లాంటి సినిమాల్లో రెచ్చిపోయి నటించింది కరీనా. ఒక టైమ్ లో ఆమెను హాట్ హీరోయిన్ అనేవారు. 2010 తర్వాత పూర్తిగా అలాంటి సన్నివేశాల్లో నటించడం మానేసింది కరీనా.

7 Replies to “అందుకే సెక్స్ సీన్స్ తగ్గించేశా”

  1. I think Hollywood movies are far better in terms of vulgarity and violence. Even the recent Indian web series portray unnecessary vulgarity, obscene language and extreme violence.

Comments are closed.