ఆశలన్నీ నామినేటెడ్ పైనేనా?

ఉత్తరాంధ్రకి ఎన్ని పదవులు ఇస్తారు అందులో టీడీపీకి ఎన్ని దక్కుతాయన్నది తమ్ముళ్ళు లెక్కించుకుంటున్నారు.

ఎమ్మెల్సీ పదవి కోసం ఉత్తరాంధ్రలో సీనియర్లు జూనియర్లు కూడా శక్తికి మించి కృషి చేశారు. అధినాయకత్వం కళ్ళలో పడడానికి విశేషంగా శ్రమించారు. కానీ అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ మహిళా నాయకురాలు కావలి గ్రీష్మకు ఈ పదవి వరించింది.

దాంతో డీలా పడిన ఆశావహులకు ఇపుడు మరో పరుగు పందెం సిద్ధంగా ఉంది. తొందరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని టీడీపీ అధినాయకత్వం చెబుతోంది. దాంతో కీలకమైన పదవులను దక్కించుకోవడానికి మళ్ళీ ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు.

కూటమిలోని మూడు పార్టీలలోని నాయకులు అంతా నామినేటెడ్ పోస్టుల మీదనే దృష్టి సారించారు. ఈ పదవులు కనుక భర్తీ అయితే ఇప్పట్లో మళ్లీ అవకాశాలు రావు అన్నది తెలిసిందే. దాంతో ఏదో విధంగా పదవి అందుకుంటే అదే పదివేలు అన్నది ఆలోచనగా ఉంది.

ఇప్పటికి రెండు విడతలుగా నామినేటెడ్ పదవుల భర్తీ సాగినా ద్వితీయ తృత్రీయ శ్రేణి నేతలకు అవి పెద్దగా దక్కలేదు. అలాగే సీనియర్లు కూడా చాలా మంది వేచి చూస్తున్నారు. దీంతో ఈసారి కొడితే జాక్ పాట్ నే కొట్టాలన్నది ప్రతీ వారి ఆలోచనగా ఉంది.

ఉత్తరాంధ్రకి ఎన్ని పదవులు ఇస్తారు అందులో టీడీపీకి ఎన్ని దక్కుతాయన్నది తమ్ముళ్ళు లెక్కించుకుంటున్నారు. తమకు పదవులు దక్కేలా చూడాలని పార్టీలోని పెద్ద నాయకులను కూడా కలుస్తున్నారు. ఉగాది లోపల పదవుల పందేరం ఉంటే అదే అసలైన ఉగాది అని అంటున్నారు.

4 Replies to “ఆశలన్నీ నామినేటెడ్ పైనేనా?”

Comments are closed.