కరోనా వైరస్ రాకతో.. సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కరీనా కపూర్ పేరు కూడా మారుమోగుతోంది. ఆస్పత్రికి వచ్చింది కరీనా కాదురా, కరోనారా అని ఎవరికి వారే సెటైర్లు పేలుస్తున్నారు. అయితే నిజంగానే కరీనా కపూర్ ఇప్పుడు ట్రోలింగ్ కి గురవుతోంది.
హైదరాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోకి హాజరైన కరీనా లాంగ్ స్కర్ట్ లో తళుక్కుమంది. అయితే మునుపటి చమక్కులు ఆమె దగ్గర లేవు. ఫేస్ లో ఆకర్షణ ఏమాత్రం లేదు. అప్పట్లో సైజ్ జీరో షేపుతో అలరించిన కరీనా.. ఇప్పుడు పూర్తిగా పాలిపోయింది. షేప్ మెయింటైన్ చేసే తపనలో ఫేస్ వాల్యూ మరిచిపోయింది.
ర్యాంప్ పై నడుస్తూ, ఫొటోలకు ఫోజులిచ్చినప్పుడు కరీనా వేసుకున్న డ్రెస్ కంటే.. పూర్తిగా వడలిపోయిన ఆమె ముఖమే ఎక్కువమందిని ఆకర్షించింది.. బెబో ఏంటి ఇలా తయారైందనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. మేకప్ తేడా కొట్టిందా, లేక కరీనా మొహమే అలా తయరైందా అంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు.అసలు మనం చూస్తోంది కరీనా కపూర్ నేనా అని సందేహం వచ్చేలా ఉంది ఆమె వాలకం.
సైఫ్ అలీఖాన్ తో పెళ్లయి, సంతానం కలిగిన తర్వాత మళ్లీ సినిమాల్లోకొచ్చిన కరీనా, ఫిట్ నెస్ విషయంలో అస్సలు అశ్రద్ధ చూపించలేదు. ఇప్పటికీ అదే షేప్ మెయింటైన్ చేస్తోంది. కానీ ఆమె గ్లామర్ మాత్రం పూర్తిగా దెబ్బతింది. అతిగా ఎక్సర్ సైజులు చేయడం వల్లనో, లేక వయసు మీద పడ్డం వల్లనో ఆమె ముఖంలో మెరుపు తగ్గింది. అంగుళం మేరకు మేకప్ వేసినా ఆ మెరుపు తీసుకురావడం మేకప్ మేన్ కు కష్టమైంది. అప్పుడు సైజ్ జీరో.. ఇప్పుడు అట్రాక్షన్ జీరో అంటూ ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది.