ప్రతిసారి త్రిష గుర్తొచ్చేది.. మరిచిపోవడం చాలా కష్టం

రీమేక్ చేసేటప్పుడు ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ లు గుర్తుకురావడం సహజం. మళ్లీ అలాగే చేస్తే కాపీ కొట్టారని అంటారు, కొత్తగా ట్రై చేస్తే సినిమా చెడిపోతుందేమో అని భయం. కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వదేమో అనే టెన్షన్.…

రీమేక్ చేసేటప్పుడు ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ లు గుర్తుకురావడం సహజం. మళ్లీ అలాగే చేస్తే కాపీ కొట్టారని అంటారు, కొత్తగా ట్రై చేస్తే సినిమా చెడిపోతుందేమో అని భయం. కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వదేమో అనే టెన్షన్. ఇలాంటి ఎన్నో డౌట్స్ మధ్య జాను సినిమాను పూర్తిచేశామంటోంది సమంత. మరీ ముఖ్యంగా షూటింగ్ జరిగినన్ని రోజులు త్రిషను మరిచిపోవడానికి చాలా కష్టపడ్డానంటోంది.

“సెట్స్ లో ఎవరైనా 96 సినిమాలో త్రిష క్లిప్పింగ్స్ చూస్తే నేను అక్కడ్నుంచి పారిపోయేదాన్ని. ఎందుకంటే, త్రిష ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జాను సైన్ చేయకముందు 96 చూశాను. ఆ తర్వాత నేను కావాలనే త్రిష యాక్టింగ్ చూడలేదు. ఎందుకంటే, అలా చూస్తే నాకు తెలియకుండానే నేను త్రిషను కాపీ చేసేస్తాను. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఎదురుగా ఉన్నప్పుడు ఎవరైనా కాపీ కొడతారు. అందుకే త్రిషను మరిచిపోవడానికి చాలా ట్రై చేశాను. ఆమె నటించిన క్లిప్స్ కాదు కదా, కనీసం పోస్టర్ కూడా చూడలేదు.”

ఇలా జాను సినిమా చేయడానికి తను ఎంత కష్టపడ్డానో వివరించింది సమంత. సినిమా రిలీజైన తర్వాత జానులో త్రిషను కాకుండా, సమంతను చూస్తే తను వందశాతం సక్సెస్ అయినట్టే అంటోంది. తను బాగా నటించానంటే దానికి శర్వానంద్ కూడా కారణం అంటోంది.

“శర్వానంద్ కు చాలా మొహమాటం, సిగ్గు. అతడితో మాట్లాడాలంటే చాలా లాగాలి. ఒక్కొక్కటిగా మాటల కలుపుతూ వెళ్తుంటే, అప్పుడు మాట్లాడతాడు. కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం మరో శర్వా కనిపిస్తాడు. నిజంగా శర్వానంద్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదేమో. సెట్స్ లో మేం చేసిన సీన్లు మేమే చూసుకొని మురిసిపోయేవాళ్లం. బాగా చేశామని అనుకునేవాళ్లు. ఇక చెప్పాల్సింది ప్రేక్షకులే.”

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది జాను సినిమా. 96 సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష పాత్రను సమంత, విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషించారు.

‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం