Advertisement

Advertisement


Home > Movies - Movie News

కార్తికేయ 2..ట్రయిలర్ బాగుందే!

కార్తికేయ 2..ట్రయిలర్ బాగుందే!

సమ్ థింగ్ స్పెషల్ లేకుండా జ‌నాలు థియేటర్ కు రావడం లేదు. ఈవారం విడుదలయిన బింబిసార,  సీతారామం ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసాయి. సిజి వర్క్స్ తో బింబిసార సోషియో ఫాంటసీ వరల్డ్ ను చూపిస్తే, టెక్నాలజీ వాడుకుని సీతారామం స్క్రీన్ మీద భారీ విజువల్స్ ను చూపించింది. వచ్చేవారం విడుదల. 

కాబోయే కార్తికేయ 2 సినిమా కూడా సమ్ థింగ్ స్పెషల్ గా వుండబోతోందని ఇప్పుడు విడుదలయిన ట్రయిలర్ క్లారిటీ ఇచ్చింది. ద్వారక-కృష్ణుడు ఈ రెండు అంశాల చుట్టూ కార్తికేయ 2 కథ నడుస్తుందని ట్రయిలర్ స్పష్టం చేసింది.

ట్రయిలర్ కట్ ఇంట్రస్టింగ్ వుంది. మైథలాజికల్ వరల్డ్ ను, వైవిధ్యమైన లోకేషన్లను చూపిస్తూనే, ఇంటస్ట్రింగ్ కథాంశమేదో వుందనే హిట్ ను ఇచ్చింది. నిఖిల్, అనుపమ, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్రలో కనిపించారు. ద్వారక దగ్గర నుంచి ప్రారంభమైన హీరో అన్వేషణ అనేక క్లిష్టమయిన లొకేషన్లలో సాగింది ఎందుకోసం అన్నది సినిమా చూస్తే తప్ప తెలియదు. అలాంటి క్యూరియాసిటీని ట్రయిలర్ జ‌నరేట్ చేసింది.

చందుమొండేటి డైరక్షన్..కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు విశ్వప్రసాద్..అభిషేక్ అగర్వాల్..వివేక్ కూచిభొట్ల.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?