Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవర్ స్టార్ కు ఇంకా నీరసం!

పవర్ స్టార్ కు ఇంకా నీరసం!

కొద్ది రోజుల పాటు విరామం లేకుండా రాజ‌కీయ కార్యకలాపాలు సాగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వారాల క్రితం అనారోగ్యానికి గురైనా సంగతి తెలిసిందే. వైరల్ ఫీవర్ బారిన పడిన పవన్ కళ్యాణ్ ఓ వారంలోనే కోలుకున్నారు.

కానీ ఇంకా నీరసం బాగా వున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరం అని పవన్ పర్సనల్ డాక్టర్ సూచించడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందుకనే ప్రజాసమస్యల దర్బార్ కార్యక్రమం నిర్వహించడం లేదు. గత రెండు మూడు వారాలుగా అది వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడుతున్నాయి. వ్యవసాయం పనులు ఊపందుకున్నాయి.అందువల్ల ఇప్పుడు రాజ‌కీయ కార్యక్రమాలు ఎవరు చేపట్టినా జ‌నం నుంచి అంత సానుకూల స్పందన వుండదు.

డాక్టర్ పాలే తాగమన్నాడు, రోగి పాలే కోరాడు అన్న సామెత మాదిరిగా విశ్రాంతి అవసరం పడింది. అదే టైమ్ లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుని అరోగ్యం కుదుట పర్చుకునే పనిలో వున్నారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ప్రస్తుతం షూటింగ్ లు కూడా బంద్ అయి వున్నాయి. పవన్ చేయాల్సిన సినిమాలు అలా వున్నాయి. అందువల్ల అవి చేయడానికి కూడా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా