అప్ కమింగ్ హీరో సంతోష్ శోభన్ చకచకా సినిమాలు చేస్తున్నాడు. ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో సినిమాలు చేయడం వరకు ఓకె కానీ సబ్జెక్ట్ ల విషయంలో కాస్త జాగ్రత్తగా వుండాలేమో? ఇప్పటికే ఏక్ మినీ కథ సినిమా చేసాడు.
చిన్న అడల్ట్ టచ్ వున్న సినిమా. లేటెస్ట్ గా ప్రేమ్ కుమార్ అనే సినిమా గ్లింప్స్ వచ్చింది. కొత్త దర్శకుడు అభిషేక్ మహర్షి అందిస్తున్న సినిమా ఇది. శివప్రసాద్ పన్నీరు నిర్మాత. గ్లింప్స్ సరదాగా బాగానే వుంది.
సబ్జెక్ట్ ఏమిటి అన్నది పూర్తిగా ఇంకా బయటకు రాకున్నా, ఓ కుర్రాడి పెళ్లి చుట్టూ తిరిగే సరదా కథ అని అనిపిస్తోంది. అంత వరకు ఫరవాలేదు. కానీ దీనికి కూడా కాస్త అడల్డ్ ఫన్ జోడిస్తేనే ప్రమాదం. గతంలో కాశీనాధ్ అనే కన్నడ నటుడు వుండేవాడు. సరాద అడల్డ్ టచ్ వున్న సినిమాలు వరుసపెట్టి చేసి, అటే ఫిక్స్ అయిపోయాడు.
సంతోష్ శోభన్ కూడా ఇలాంటి సినిమాలే వరుసగా రెండు మూడు చేసాడు అంటే మన మేకర్లు ఇక అంటే లాక్కుపోయే ప్రమాదం వుంది. ఈ విషయంలో జాగ్రత్త పడాల్సి వుంది.