కాశ్మీర్ నేపథ్యంలో చేపలవేట

ఆపరేషన్ గోల్డ్ ఫిష్. టెర్రరిజం, కాశ్మీరీ పండిట్లు, ఇతరత్రా వ్యవహారాల నేపథ్యంలో అల్లుకున్నతో తీసిన సినిమా. ఈ సినిమా ట్రయిలర్ విడుదల చేసారు. పక్కాగా టెర్రరిజం నేపథ్యంలో అల్లుకున్న యాక్షన్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది.…

ఆపరేషన్ గోల్డ్ ఫిష్. టెర్రరిజం, కాశ్మీరీ పండిట్లు, ఇతరత్రా వ్యవహారాల నేపథ్యంలో అల్లుకున్నతో తీసిన సినిమా. ఈ సినిమా ట్రయిలర్ విడుదల చేసారు. పక్కాగా టెర్రరిజం నేపథ్యంలో అల్లుకున్న యాక్షన్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. ఆది సాయికుమార్, శేషాషెట్టి, నిత్య నరేష్ నటించిన ఈ సినిమాకు అడవి సాయికిరణ్ దర్శకుడు.

ఇటీవల వార్తల్లోకి  ఎక్కడి కాశ్మీర్ వ్యవహారాలు, కాశ్మీర్ పండిట్ల జీవితాల నేఫథ్యంలో అల్లుకున్న కథతో ఈ సినిమా తయారుచేసినట్లు కనిపిస్తోంది. అటు తీవ్రవాదం, ఇటు ఓ ప్రేమకథ కలిపి పడుగు పేక మాదిరిగా అల్లినట్లు అనిపిస్తోంది. ట్రయిలర్ మొత్తం చూస్తే కథ కన్నా, నెరేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాస్త స్టాండర్స్ వున్న చిత్రీకరణ, యాక్షన్ సీక్వెన్స్ లు ట్రయిలర్ లో చోటు చేసుకున్నాయి. అయితే బేసిక్ థ్రెడ్ ఎక్కడా టచ్ కాకుండా, కేవలం యాక్షన్ థ్రిల్లర్ మాదిరిగా ట్రయిలర్ ను ప్రెజెంట్ చేసారు. చిత్రీకరణలో కాస్త భాగానే ఖర్చు చేసి, రియలిస్టిక్ లోకేషన్లకు వెళ్లి షూట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే సీన్లు కావచ్చు, డైలాగులు కావచ్చు, ఇప్పటికే చాలాసార్లు చూసిన సినిమాలను గుర్తు చేస్తున్నాయి. సినిమాలో కొత్తదనం, విడుదలయ్యాక మాత్రమే తెలిసే అవకాశం వుంది.