‘రంగీలా’నూ చెడగొట్టే పని మొదలు!

తను ఏ సినిమాలను అయితే గొప్పగా తీశాడో.. తను ఏ సినిమాలను అయితే అభిమానిస్తూ గొప్పగా చెప్పాడో.. అవే సినిమాలను దుంపనాశనం చేసే పని చాన్నాళ్లుగా చేస్తూవస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. 'ఆగ్'తో వర్మ…

తను ఏ సినిమాలను అయితే గొప్పగా తీశాడో.. తను ఏ సినిమాలను అయితే అభిమానిస్తూ గొప్పగా చెప్పాడో.. అవే సినిమాలను దుంపనాశనం చేసే పని చాన్నాళ్లుగా చేస్తూవస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. 'ఆగ్'తో వర్మ పతనావస్థ మొదలైంది. తను కావ్యంగా వర్ణించిన 'షోలే' సినిమాను ముందుగా అదే పేరుతో రీమేక్ మొదలుపెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అమితాబ్, మోహన్ లాల్, అజయ్ దేవగణ్ వంటి స్టార్లతో రూపొందించిన ఆ సినిమా చివరకు ఒక చిల్లర సినిమాగా మిగిలిపోయింది!

ఒరిజినల్ మేకర్లు ఆక్షేపించడంతో దానికి ఆగ్ అని పేరు మార్చి విడుదల చేశాడు వర్మ. అది డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆర్జీవీ సినీ కెరీర్ ఒక్కో మెట్టూ కిందకే జారుతూ వచ్చింది. ఆ తరుణంలో 'శివ', 'అనగనగా ఒకరోజు' వంటి సినిమాలను హిందీలో రీమేక్ చేసి ఫ్లాఫులను మూటగట్టుకున్నాడు. శివను శివ 2006 పేరుతో తీసి చేతులు కాల్చుకున్నాడు.

సర్కార్ కు సీక్వెల్స్ తో విసిగించాడు, సత్యను సత్య టూ పేరుతో డిజాస్టర్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు 'రంగీలా' వంతు వచ్చిందట. 'బ్యూటిఫుల్' పేరుతో రంగీలకు ట్రిబ్యూట్ ఇస్తారట! వర్మ ఫామ్ ను బట్టి చూస్తే.. ఇది 'రంగీలా' ఫ్యాన్స్ ను కూడా నిస్తేజపరిచేందుకే తప్ప మరో దానికి కాదని స్పష్టంగా చెప్పడానికి వెనుకాడనక్కర్లేదేమో!

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!