మనం, ఇష్క్ ఇలా మంచి సినిమాలకు మంచి సంగీతం అందించిన దర్శకుడు అనూప్ రూబెన్స్. ఈ మధ్య కాస్త వెనకబడిన అనూప్ మళ్లీ 90ఎంఎల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 6న విడుదలయ్యే 90ఎమ్ ఎల్ సినిమాలో కార్తికేయ హీరో. ఈ నేపథ్యంలో అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడాడు.
90 ఎమ్ ఎల్ సినిమాలో ఆరు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. అన్నీ మాస్ సాంగ్స్. కార్తికేయ బయట ఎలా ఉంటాడో దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ చిత్రంలో అలాగే చూపించారు.ఈ సినిమాలో సాంగ్స్ కి స్కోప్ చాలా ఉంది అలాగని పాటల నిడివి ఎక్కువ ఉండదు, దర్శకుడు కథని అలా మలిచారు. నేను రెండు మూడు మాస్ సినిమాలు చేసాను కానీ ఇది దానికి పూర్తి భిన్నంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.
ఈమధ్య కాలంలో నేను అనుకున్నవి కొన్ని జరగలేదు, పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని అనుకున్నట్టుగా అవ్వలేదు కానీ నా చేతిలో ఏమి లేదు, సమయం వచ్చినపుడు ఏది అలా జరగాలో అది జరుగుతుంది అని నమ్ముతున్నాను.
దర్శకుడు పూరి గారి తో నాకు ముందునుండి మంచి అనుబంధం ఉంది, రెగ్యులర్ గా మాట్లాడటమే కాక అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఆయన ఒక డైరెక్టర్ గా కంటే మంచి వ్యక్తి గా నాకు బాగా ఇష్టం, పరిచయం. త్వరలో మళ్లీ నితిన్ సినిమాకు పనిచేయబోతున్నాను. ఇది కాక ఓ కన్నడ సినిమా, కొన్ని తెలుగు సినిమాలు డిస్కషన్ లో వున్నాయి.
90ఎమ్ ఎల్ సినిమాకు ఆ టైటిల్ వున్నా, నాకు అయితే అలవాటు లేదు. కానీ ఈ సినిమాకు సంగీతం చేయడమే నాకు ఫుల్ కిక్ ఇచ్చింది. నేను చేసాను అని కాదు గాని సంగీతంతో పాటు వైవిధ్యమైన కథ, కార్తికేయ డాన్సులు, కామెడీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతాయి అనుకుంటున్నాను అన్నారు అనూప్ రూబెన్స్.