వివాదాస్పడ సోషల్ మీడియా సావియర్ కత్తి మహేష్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసారు. ఆయన గతంలో ఓ సమావేశంలో రాముడిపై, రామాయణంపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. ఆ కేసులోనే ఇప్పుడు ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్ ఓసారి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. కత్తి మహేశ్ ప్రసంగంపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదులు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153 ఎ కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పలు విచారణల అనంతరం శుక్రవారం కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఉస్మానియా హాస్పిటల్‌లో పరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది.