బుల్లితెర గ్లామర్ యాంకర్ అనసూయ ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడుతారనే పేరు ఇండస్ట్రీలో ఉంది. సోషల్ మీడియాలో కూడా అనసూయ యాక్టీవ్‌గా ఉంటూ తన అభిప్రాయాల్ని, అభిరుచుల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆ మధ్య అనసూయ బర్త్‌డే సందర్భంగా ధరించిన డ్రెస్‌పై ఓ నెటిజన్ అభ్యంతకర కామెంట్ చేయడంతో ఆమె ఫైర్ అయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా అన్ని భాషల చిత్రపరిశ్రమల్లో బంధుప్రీతి (నెపోటిజం)పై విపరీతంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. నటులు ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే…తప్పకుండా నెపోటిజంపై యాంకర్లు ప్రశ్నించకుండా వదిలి పెట్టడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై యాంకర్ అనసూయను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై అలరిస్తూ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ. పలు సమస్యలపై తనదైన శైలిలో స్పందించే అనసూయ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడింది.
“గతంలో ఫేవరెటిజం కారణంగా నేను కూడా చాలా అవకాశాలు కోల్పోయాను. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఒకే ఒక్క కారణంతోనే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా మాట్లాడుతా. రెండేళ్ల క్రితం గ్రూప్ ఫేవరెటిజం వల్లే నేను అవకాశాలు కోల్పోయాను. అయినా నా టాలెంట్‌నే నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా. కష్టాన్ని నమ్ముకుంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు” అని అనసూయ చెప్పుకొచ్చారు.
ఇంకా ఇలాంటి విషయాలు అనసూయ మనసులో ఇంకా ఏవేవి ఉన్నాయో మరి. సమయం చూసుకుని ఇండస్ట్రీలోని లోపాలను ఒక్కొక్కటిగా అనసూయ చెప్పేలా ఉన్నారు. ఇంతకూ కోల్పోయిన ఆ అవకాశాల వల్ల అనసూయ ఎంత నష్టపోయారో చెప్పలేదే? అదేంటో చెబితే దానికో సంపూర్తత్వం ప్రాప్తిస్తుంది కదా!