సినిమా హాళ్లు తెరవాలి.. ఓటీటీలు వెయిటింగ్!

ఓటీటీలు సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయమా? లాక్ డౌన్ నిబంధనలు సడలించి థియేటర్లు తెరిస్తే.. ప్రేక్షకులంతా తిరిగి అక్కడికే పరుగులు తీస్తారా? ఈ రెండింటిలో ఏ వ్యవస్థది పైచేయి. టాలీవుడ్ తో సహా.. దేశవ్యాప్తంగా ఇదే…

ఓటీటీలు సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయమా? లాక్ డౌన్ నిబంధనలు సడలించి థియేటర్లు తెరిస్తే.. ప్రేక్షకులంతా తిరిగి అక్కడికే పరుగులు తీస్తారా? ఈ రెండింటిలో ఏ వ్యవస్థది పైచేయి. టాలీవుడ్ తో సహా.. దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. లెక్కప్రకారం థియేటర్లు తెరవడం ఆలస్యం కావాలని ఓటీటీ యాజమాన్యాలు కోరుకోవాలి. అయితే దీనికి విరుద్ధంగా థియేటర్లు తెరిస్తేనే అసలు విషయం బైటపడుతుందని ఆశిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.

ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే సాహసం ప్రభుత్వాలు చేయవు. ఒకవేళ చేసినా సోషల్ డిస్టెన్స్, నిబంధనలు, ప్రమాణాలు అంటూ సవాలక్ష కండిషన్లు పెడతాయి. ప్రేక్షకులు కూడా ప్రాణాలకి తెగించి థియేటర్ కి వెళ్లాలని అనుకోరు కదా. ఓసారి థియేటర్లు తెరిస్తే.. ప్రేక్షకుల స్పందన చూస్తే.. అసలు విషయం బైటపడుతుంది.

అంటే రాబోయే రోజుల్లో థియేటర్లు ఏమాత్రం వర్కవుట్ కావు అని తేలిపోతే ప్రేక్షకులు తమపై మరింత నమ్మకం పెంచుకుంటారనేది ఓటీటీ సంస్థల ఆలోచన. ఇటీవల అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.

అరవింద్ అటు థియేటర్లు, ఇటు ఓటీటీ రెండింటికీ సంబంధించిన వ్యక్తి. ఏది బాగున్నా.. ఆయనకు లాభమే. అయితే అరవింద్ మాత్రం థియేటర్లపై ఓటీటీ ప్లాట్ ఫామ్ దే పైచేయి అని తేల్చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్ లో సినిమా హాళ్లు తెరిచినా అవి కేవలం వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కే పరిమితమవుతాయనేది అరవింద్ వాదన. అలాంటప్పుడు థియేటర్లు తెరిచినా ఓటీటీలకు వచ్చే నష్టమేమీ లేదు.

పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకముందే థియేటర్లు తెరిస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇటీవల జిమ్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. జిమ్ లు అందుబాటులోకి వచ్చినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అందరూ ఇంట్లోనే కసరత్తులు చేసుకుంటున్నారు. ఇలానే థియేటర్లను తెరిచినా పెద్దగా ప్రయోజనం ఉండదనేది విశ్లేషకుల అభిప్రాయం.

అల్లు అరవింద్ చెప్పినట్టు థియేటర్లు వీకెండ్ ఎంటర్టైన్ మెంట్ కే పరిమితమైతే.. కచ్చితంగా థియేటర్లపై ఓటీటీలదే పైచేయిగా మిగులుతుంది. ఈ లాంఛనం కోసమే ఓటీటీలన్నీ వెయిటింగ్. అందుకే సినిమా హాళ్లు తెరవాలనే అవి కోరుకుంటున్నాయి.

బాబుగారి గాలి తీసేసిన యువరాణి

టిడిపిని ద్వంసం చేసి, ఆ పునాదులపై ఎదగాలని