ఒక్కో ప్రాంతంలో ఒక్కోతరహా సినిమాలకు ఆదరణ ఎక్కువ వుంటుంది. మల్టీ ఫ్లెక్స్ లో ఒకలాంటి సినిమాలకు, సింగిల్ స్క్రీన్ ల్లో మరో తరహా సినిమాలకు ఆదరణ వుంటుందని కొన్ని పడికట్టు లెక్కలు వున్నాయి.
ఈ లెక్కల ప్రకారం సీడెడ్ అంటే చంపు…నరుకు..యాక్షన్..మాస్ మసాలా సినిమాలకు ఎక్కువ ఆదరణ వుంటుందని సినిమా జనాల నమ్మకం. అందుకు తగినట్లే భారీ మాస్ యాక్షన్ సినిమాలు అక్కడ బాగా ఆడతాయి. కానీ అక్కడ వున్నదీ మనుషులే. వారికీ ప్రేమలు వుంటాయి. వాటి మీద ఆసక్తి వుంటుంది. బహుశా అందుకే కావచ్చు.
ప్రభాస్-పూజాల ప్యూర్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ తొలి మూడు రోజులు సీడెడ్ లో కూడా మంచి ఫలితాలు నమోదు చేసింది. ఇది కాస్త ఆశ్చర్యకరమైన సంగతే. ప్యూర్ లవ్ స్టొరీలు, టూ క్లాస్ సినిమాలు పెద్దగా ఆడవు సీడెడ్ లో అని టాక్ వుంది.
కానీ రాధేశ్యామ్ మూడు రోజులుకు ఏడు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పైగా మండే కూడా స్టడీగా వుంది. ఇదంతా ప్రభాస్ పర్సనల్ క్రేజ్ అనుకోవాల్సిందే. వీక్ డేస్ లో కనుక కాస్త స్టడీగా వుంటే మళ్లీ వీకెండ్ వేళకు మంచి ఫలితాలు నమోదయ్యే అవకాశం వుంది.