Advertisement

Advertisement


Home > Movies - Movie News

షూటింగ్స్ కు లైన్ క్లియర్

షూటింగ్స్ కు లైన్ క్లియర్

టాలీవుడ్ లో షూటింగ్స్ కు మార్గం సుగమం అయింది. జూన్ మొదటి వారం నుంచి షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినీ పెద్దలకు భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన విధివిధానాలతో త్వరలోనే జీవో జారీ అవుతుంది.

సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో కలిసి సినీపెద్దలు కొంతమంది కేసీఆర్ ను కలిశారు. టాలీవుడ్ కు కలిగిన నష్టాన్ని వివరించారు. షూటింగ్స్ కు అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, జూన్ మొదటివారం నుంచి షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చని తెలిపారు. షూటింగ్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం చేసుకోవచ్చు.

షూటింగ్స్ కు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తుందని.. వాటిని అనుసరిస్తూ షూటింగ్స్ చేసుకోవాలని సూచించారు. దీనికి సినీపెద్దలు అంగీకరించారు. ఈరోజు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్, సురేష్ బాబు, కొరటాల తదితరులు పాల్గొన్నారు.

అయితే షూటింగ్స్ ప్రారంభమైనా థియేటర్లు మాత్రం తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా హాళ్లను ఆగస్ట్ లో తెరవాలని తెలంగాణ థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే నిర్ణయం అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రతి థియేటర్ లో కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టాలి, ఎంట్రన్స్ గేట్ వద్ద శానిటైజర్లు ఉంచాలి. వీటికి తోడు భౌతిక దూరాన్ని పాటించేలా సగం టిక్కెట్లను మాత్రమే అమ్మాలి. వీటన్నింటికీ తోడు రోజూ 4 ఆటలు కాకుండా, 3 ఆటలకే థియేటర్లను పరిమితం చేసే అవకాశం ఉంది. మల్టీప్లెక్సులకు మాత్రం ఈ షోల నిబంధన వర్తించదు. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ నియమ నిబంధనలన్నీ ప్రతి థియేటర్ లో తప్పనిసరిగా పాటించాలి. త్వరలోనే దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీచేయబోతున్నాయి.

చంద్రబాబు రాజకీయానికి వారిద్దరూ బలయ్యారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?