రాజమౌళి చిన్న పిల్లల సినిమాలు చూస్తాడు

తెరపై రౌద్రాన్ని, ఎమోషన్ ను అద్భుతంగా పండించే రాజమౌళి.. రియల్ లైఫ్ లో మాత్రం చిన్న పిల్లల సినిమాలు ఎక్కువగా చూస్తుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు కీరవాణి బయటపెట్టాడు. Advertisement “రాజమౌళిలో…

తెరపై రౌద్రాన్ని, ఎమోషన్ ను అద్భుతంగా పండించే రాజమౌళి.. రియల్ లైఫ్ లో మాత్రం చిన్న పిల్లల సినిమాలు ఎక్కువగా చూస్తుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు కీరవాణి బయటపెట్టాడు.

“రాజమౌళిలో నచ్చిన విషయం ఏంటంటే.. ఒక పని నచ్చితే దాన్ని పూర్తిచేసే వరకు వదిలిపెట్టడు. ఏకాగ్రత ఎక్కువ. నచ్చని విషయం ఏంటంటే.. ఎక్కువగా చిన్న పిల్లల సినిమాలు చూస్తుంటాడు. మెచ్యూర్డ్ సినిమాలు చూద్దాం అంటే వినడు. ఒక్కడు పక్కకెళ్లిపోయి చిన్న పిల్లల సినిమాలు చూస్తుంటాడు. నేను కొన్ని సినిమాలు చూడమని రాజమౌళికి చెప్పాను, ఇప్పటివరకు చూడలేదు. ఉదాహరణకు ఫారెస్ట్ గంప్ అనే సినిమా చూడమని చెప్పాను. మొన్ననే నేను చూశాను చాలా నచ్చింది. అది రాజమౌళికి చూడమని చెబితే చూడలేదు. ఇలా చాలా సినిమాలున్నాయి.”

ఇక స్టోరీ డిస్కషన్ విషయానికొస్తే.. మిగతా సినీజనాలకు, తమ సభ్యుల మధ్య కథాచర్చలకు మధ్య తేడాను స్పష్టంగా వివరించారు కీరవాణి. తమ కథాచర్చల్లో అరుచుకోవడాలు, కోపాలు ఉండవంటున్నారు.

“మా కుటుంబ సభ్యులం అందరం స్టోరీ డిస్కషన్లలో పాల్గొంటాం. అంతా ఒకటే కాబట్టి కథాచర్చల టైమ్ లో లేచి వెళ్లిపోయిన సందర్భం అనేది రాలేదు. ఒకరిపై ఒకరు అరుచుకోవడం కూడా జరగలేదు. అంతా కూర్చొని మాట్లాడుకుంటాం. ఏదైనా సీన్ గురించి అనుకున్నప్పుడు అందరూ ఒప్పుకునే వరకు చర్చించుకుంటాం.”

ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు హీరోల్ని సినిమాలో ఎలా బ్యాలెన్స్ చేశారనే డౌట్ అందరికీ ఉంటుందని, సినిమా అనుకున్నప్పుడు అదే డౌట్ మాకు కూడా వచ్చిందని కీరవాణి అన్నారు. ముందుగా ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకున్న తర్వాత అడుగు ముందుకేశామని… ఈ విషయంలో కథారచయిత విజయేంద్రప్రసాద్ కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలంటున్నారు. ఇద్దరు పెద్ద హీరోల్ని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా ఆర్ఆర్ఆర్ కథ రాశారని, ప్రేక్షకులకు 200శాతం ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అంటున్నారు. 

కన్నా బీజేపీకి మాత్రం కన్నం వెయ్యకు