కీర్తి-అనిరుధ్..ఓ ఫోటో గ్యాసిప్

వారం రోజులుగా తమిళ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. పాపులర్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్, పాపులర్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటారా? అన్నది ఆ గ్యాసిప్. Advertisement నిజానికి అనిరుధ్ పెళ్లి…

వారం రోజులుగా తమిళ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. పాపులర్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్, పాపులర్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటారా? అన్నది ఆ గ్యాసిప్.

నిజానికి అనిరుధ్ పెళ్లి మీద గతంలో కూడా గ్యాసిప్ లు వచ్చాయి. ఓ సింగర్ ను పెళ్లి చేసుకుంటాడని టాక్ పుట్టింది. ఇప్పుడు ఈ ఫోటో బయటకు రావడంతో ఈ కొత్త గ్యాసిప్ షురూ అయింది.

అంతే కాదు. ఫొటోను పట్టుకుని ఇది కాస్త మందుడోస్ మీద వున్నపుడు తీసిన ఫొటోలా వుందంటూ కథలు అల్లేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మీద ఎటునుంచి ఎవ్వరూ స్పందించలేదు. 

కానీ ఒకటి మాత్రం వాస్తవం బయట తిరుగుతున్న ఫొటొ చూస్తుంటే అనిరుధ్-కీర్తిల నడుమ కాస్త గట్టి చనువైన స్నేహమే వుంది అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్ లలో బిజీగా వున్నారు. అందువల్ల ఈ ఫొటో గ్యాసిప్ గ్యాసిప్ గానే వుంటుంది. 

ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టాలి?

21 తర్వాత వాస్తవాలను మీడియాతో వెల్లడిస్తా