Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'కొత్తగా రెక్కలొచ్చెనా' లోగో..పోస్టర్

 'కొత్తగా రెక్కలొచ్చెనా' లోగో..పోస్టర్

వాలంటైన్స్ డే స సందర్భంగా  రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన "కొత్తకా రెక్కలొచ్చెనా" సినిమా లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉప్పెన చిత్ర యూనిట్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

అనంతరం లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ..కోవిడ్ టైం లో అందరమూ ఎన్నో ఇబ్బందులతో ఎంతో బాధపడ్డాము. కొవిడ్ తర్వాత అందరికీ కొత్త రెక్కలు వచ్చినట్లు, న్యూ లైఫ్ బిగిన్ అయినట్లు భావిస్తున్నారు .

అలాగే ఈ  సినిమా "కొత్తగా రెక్క.లొచ్చెనా"సినిమాను  ప్రెజెంట్ జనరేషన్ కు  ఆఫ్టర్ 80 తర్వాత ఉన్న జనరేషన్ కు ఉన్న ఎమోషన్స్ క్యారీ చేస్తూ  చేయడం జరిగింది . అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి  ప్రదీప్ దర్శకుడిగా ఈ మూవీకి పరిచయం అవుతున్నారు. 

"కొత్తగా రెక్కలొచ్చెనా "లోగోను ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు,నిర్మాత నవీన్ లు లాంచ్ చేయడం,ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో వైష్ణవ్ తేజ్,కృతి శెట్టిలు లు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు వస్తామని లగడపాటి శ్రీధర్ తెలిపారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?