తానా ఖర్చులను తవ్వుతున్నారు

అమెరికాలో కొంతమంది తెలుగువారి సంఘం తానా. చాలా ప్రెస్టీజియస్ సంఘం ఇది. పైగా బాగా డబ్బున్న సంఘం ఇది. తానా కార్యవర్గ పదవులు చేపట్టడం అన్నది ఓ ప్రెస్టీజ్ గా తీసుకుంటారు. పదవులు చేపట్టిన…

అమెరికాలో కొంతమంది తెలుగువారి సంఘం తానా. చాలా ప్రెస్టీజియస్ సంఘం ఇది. పైగా బాగా డబ్బున్న సంఘం ఇది. తానా కార్యవర్గ పదవులు చేపట్టడం అన్నది ఓ ప్రెస్టీజ్ గా తీసుకుంటారు. పదవులు చేపట్టిన వాళ్లు అక్కడ అమెరికాలో కన్నా, ఇక్కడ ఇండియాలో హడావుడి ఎక్కువ చేస్తుంటారు. రాజకీయ ఎఫిలియేషన్ల సంగతి చెప్పనక్కరలేదు. 

ఇలాంటి తానా సంఘానికి మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి పలువురు, అనేక పదవులకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వున్న కార్యవర్గం మద్దతుతో. అలాగే చిరకాలంగా తానా పై తమ పట్టుపోకుండా కాపాడుకుంటూ వస్తున్న వారి మద్దతుతో కొందరు పోటీ చేస్తున్నారు. ఒక విధంగా వీరు అధికార వర్గం అనుకోవాలి. వీరు కూడా రెబల్స్ గా మారి మరి కొందరు పోటీ చేస్తున్నారు. ఇలా పోటీ చేస్తున్నవారిలో గతంలో కార్యవర్గంతో సంబంధాలు వున్నవారూ వున్నారు.

మొత్తం మీద అందరూ గట్టి పట్టు పట్డడంతో తానా లోని లుకలుకలు, అవకతవకలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వినిపిస్తున్నాయి.  ఆ మధ్య జరిగిన తానా బోర్డు సమావేశంలోనే ఈ లెక్కల మీద కొందరు గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది.

ఆ ముగ్గురి అవినీతి?

సుదీర్ఘ కాలంగా తానాను తమ కబంధ హస్తాలలో పెట్టుకుని సంఘం సొమ్మును మేసేస్తున్న వారు ముగ్గురు వున్నారన్న ప్రచారం తానా సభ్యుల్లోకి నెమ్మదిగా చేరుకుంటోంది.  తానా సొమ్మును తినేస్తూ సంఘం ఉమ్మడి ప్రయోజనాలకు భిన్నంగా తమకు అనుకూలంగా వ్యవహారాలు నెరపుతున్నాురి, వారికి ఈ విడత ఒటమి అనివార్యమన్న భావన వ్యాప్తిలోకి వస్తోంది. 

చాలా కాలంగా రాబుందుల్లా తానాను మేసేస్తున్న ఈ పెద్దలు మరోసారి సంస్ధను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పెద్ద పధకాన్నే రచించారని,  సెలక్షన్ ప్యానల్ పేరిట తానా ఎన్నికల్లో తమ వారిని పోటికి దింపిన ఈ అక్కమార్కులు, వారి గెలుపు ఆసరాగా తమ అవినీతి కుంభకోణాలు బయట పడకుండా చూసుకోవాలని తాపత్రయ పడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

అవినీతి బయటకు వస్తుందా?

ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అన్నది పక్కన పెడితే, అసలు వచ్చే కార్యవర్గం తానాలో గతంలో జరిగిన అవీనితిని, అసలు లెక్కలను బయటపెడుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తానా నుంచి పలువురు సినిమా హీరోయిన్లకు లక్షలు లక్షల చెల్లింపులు జరిపారట. కానీ వాటిని ఎందుకు జరిపారన్న వివరాలు లేవట. అలాగే నిబంధనలకు విరుద్దంగా ట్రంప్ కు మద్దతు పఛారానికి కొన్ని లక్షలు కేటాయించారట. 

ఛానెల్ లోకి నిధుల ప్రవాహం

ఒక తెలుగు ఛానెల్ అక్కౌంట్ లోకి, ఆ ఛానెల్ కు చెందిన కొందరు ఉద్యోగుల అక్కౌంట్లలో తానా నుంచి కొంత నిధులు మళ్లించారనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. తాము గెలిస్తే ఇవన్నీ బయటకు తీస్తామని తానాకు చెందిన కొందరు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వివరాలు చాలా సేకరించి పెట్టారని బోగట్టా. అవన్నీ ఎన్నికల టైమ్ లో ఆయుధాలుగా వాడడమా? లేదా ఎన్నికల తరువాత సభ్యులందరి ముందు ఈ చిట్టాను పెట్టడమా అనే డిస్కషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మొత్తం మీద ఈసారి తానా ఎన్నికలు రసవత్తరంగా మారడం సంగతి అలా వుంచితే, ఈ నిధుల అవకతవకల్ని, ఎవరెవరితోనో వున్న ఆర్ధిక బంధాలను బయట పెట్టేలాగే వుంది.

ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టాలి?