లేటెస్ట్ గా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి ఇది. కేఙిఎఫ్ 2 సినిమాను ఆంధ్రలో పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. అది కూడా ముందు అనుకున్న అమౌంట్లలో 60 శాతం మొత్తానికే. అది కూడా రికవరీ మీద. ఙస్ట్ 9శాతం కమిషన్ ఇచ్చేలా.
అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎంత లైన్ ఇన్ స్పెక్టర్లు,చెకింగ్ లు వున్నా, తక్కవ శాతం కమిషన్ వుండడం, కలెక్షన్లు బాగుండడంతో కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు చేతివాటం ప్రదర్శించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒక్కో ఏరియాకు ఒక్కో విధంగా కాస్త కలెక్షన్లు నొక్కారని బయ్యర్ వర్గాల్లోనే వినిపిస్తోంది. కేవలం తొమ్మిది శాతం కమిషన్ ఏం కిట్టుబాటు అవుతుందని, ఆ మాత్రం నొక్కకుంటే వ్యాపారం ఎలా సాగుతుందని, డిస్ట్రిబ్యూషన్ లో ఇది కామన్ విషయమని ఓ డిస్ట్రిబ్యూటర్ అన్నారు.
ఆంధ్రలోని ఓ ఏరియాలో చూపిస్తున్న కలెక్షన్లకు, ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్లలో వినిపిస్తున్న ఫిగర్ కు కోటి రూపాయలు తేడా వుంది.
ఇదిలా వుంటే నైఙాంలో కేఙిఎఫ్ 2 కలెక్షన్లు 37 కోట్లకు చేరిపోయాయి. రంఙాన్ హాలీడే, మేడే వుండడంతో కచ్చితంగా 42 కోట్ల మేరకు ఫైనల్ కలెక్షన్లు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అలా ఙరిగితే అల వైకుంఠపురములో రికార్డు మాయం అవుతుంది.