పాన్ ఇండియా…భారీ సినిమా అనేసరికి దర్శకులకు గ్రాఫిక్స్ పిచ్చి పట్టేసుకుంది. గ్రాండియర్ వుంటెే చాలు జనం మైమరిచిపోతారు అనే భావన మొదలైంది. ఆర్ఆర్ఆర్ విషయంలో ఇదే కంప్లయింట్.
కథ మీద పెద్దగా కసరత్తు చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ రోజు కేఙిఎప్ 2 ట్రయిలర్ వచ్చింది. దాని వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
కేజిఎఫ్ 2 అంటే వన్ కు బాబులా వుండాలని ఏకంగా జెట్ లు, షిప్ లు, ఏది పడితే అది వాడేసారు. రాజకీయం కూడా చొప్పించేసినట్లు కనిపిస్తోంది. ట్రయిలర్ మొత్తం భారీ తనం పరుచుకుంది కానీ హీరో పాత్రకు సరైన సీన్లు కానీ, కథ ఇదీ అని తెలిసే థ్రెడ్ కానీ లేదు. వాస్తవానికి కేజిఎప్ వన్ లో కూడా పెద్దగా కథ లేదు. యాక్షన్ ఎమోషన్లే తప్ప. ఇప్పుడు కూడా చూస్తుంటే దాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.
అయితే కెజిఎప్ సినిమా ఏ అంచనాలు లేకుండా విడుదయింది. కానీ కేజిఎప్ 2 అలా కాదు. దాని మీద బోలెడు అంచనాలు వున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీతనాన్ని, భారీ యాక్షన్ సీన్లను నమ్ముకుని ముందుకు వెళ్లినట్లు ట్రయిలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.