కేజీఎఫ్ ఛాప్టర్-1 ఊహించని విజయాన్ని సాధించింది. ఆ సినిమా ఆ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటి బ్లాక్ బస్టర్ కు సీక్వెన్స్ గా వచ్చిన కేజీఎఫ్-2పై అంచనాలు పెరిగిపోతాయి. చాలామంది చాలా ఊహించుకున్నారు. అందరి అంచనాల్ని అందుకొని, ఊహాలకు అందని విజయాన్ని సాధించింది కేజీఎఫ్-2. మరి కేజీఎఫ్ ఛాప్టర్-3 పరిస్థితేంటి?
కేజీఎఫ్ ఛాప్టర్-3 కూడా ఉంటుంది. కానీ ఇప్పట్లో రాదనేది తాజా సమాచారం. స్వయంగా యష్ కాంపౌండ్ నుంచి ఈ మేటర్ బయటకొచ్చింది. హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య ఛాప్టర్-3కి సంబంధించి చర్చ జరిగింది. ఓ లైన్ కు ఇద్దరూ సూచనప్రాయంగా అంగీకరించారు.
కానీ అది చాలదనేది యష్ ఫీలింగ్. ఎందుకంటే, కేజీఎఫ్-2 ఖండాంతరాలు దాటిపోయింది. పాన్ వరల్డ్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది. సో.. ఈసారి వరల్డ్ ఆడియన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని లైన్ రాసుకోవాల్సి ఉంటుంది. అందుకే టైమ్ అవసరమనేది యష్ ఫీలింగ్.
ఇటు ప్రశాంత్ నీల్ కూడా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అవి పూర్తయిన తర్వాత ఛాప్టర్-3 మీద కూర్చునే అవకాశం ఉంది.
ఈ గ్యాప్ లో జపాన్ ను సందర్శించాలనుకుంటున్నాడు యష్. కేజీఎఫ్ ఛాప్టర్-2తో అతడికి జపాన్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు.