కేజీఎఫ్ ఛాప్టర్-1 హిట్టయినప్పుడు ఆమెపై పెద్దగా ఫోకస్ లేదు. కానీ ఛాప్టర్-2 అంతకుమించి హిట్ అవ్వడంతో, ఆ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టిపై ఆరాలు పెరిగాయి. కుదిరితే ఆమెను తమ సినిమాలోకి తీసుకునేందుకు కొంతమంది తెలుగు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అలా కేజీఎఫ్ క్రేజ్ ను తమ సినిమా కోసం వాడుకోవాలని చూస్తున్నారు.
తనకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తాయనే విషయం శ్రీనిధికి కూడా తెలుసు. నిజానికి ఛాప్టర్-1 హిట్టయినప్పుడే ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ వేచిచూసే ధోరణిలో ఉంది. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్-2 సక్సెస్ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది శ్రీనిధి.
ప్రస్తుతానికైతే తన దగ్గరకొచ్చిన ఆఫర్లను పెండింగ్ లో పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేతిలో విక్రమ్ హీరోగా నటిస్తున్న కోబ్రా అనే సినిమా మాత్రమే ఉంది. తెలుగులో స్టార్ హీరోల ఆఫర్లు వస్తే చేయాలని ఆమె అనుకుంటోంది. కానీ ఓ మీడియం రేంజ్ హీరో పక్కన ఆఫర్ రావడంతో ఆలోచనలో పడింది.
అటుఇటుగా కాస్త టైమ్ పట్టొచ్చేమో కానీ, శ్రీనిధి టాలీవుడ్ లోకి రావడం మాత్రం పక్కా. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు షురూ అయ్యాయి. ఇంతకుముందు రష్మిక కూడా ఇలానే వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో ఓ పెద్ద హిట్ కొట్టి, ఇప్పుడు టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.
బాలీవుడ్ కు కూడా వెళ్లిపోయింది. శ్రీనిధి కూడా అలానే చేస్తుందేమో. ఎందుకంటే ఈమె వెనక కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమా ఉంది మరి.