కుబేరుడు ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకల్లో ఖాన్ హీరోలు డాన్స్ చేశారు. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి చేసిన డాన్స్, ఆ క్షణంలో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒక్కో ఖాన్ హీరోపై ఒక్కో విమర్శ చెలరేగింది. వాటిపై వాళ్లు స్పందించారు కూడా.
ముందుగా అమీర్ ఖాన్ విషయానికొద్దాం. అనంత అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో ఇతడు డాన్స్ చేశాడు. కూతురు పెళ్లిలో డాన్స్ చేయడు కానీ, డబ్బులిస్తే అంబానీ పెళ్లిలో డాన్స్ చేస్తాడంటూ అమీర్ ఖాన్ పై విమర్శలు చెలరేగాయి. తాజాగా వీటిపై అమీర్ స్పందించాడు.
తన కూతురు పెళ్లిలో తను డాన్స్ చేశానని, కాకపోతే ఆ వీడియో బయటకు రాలేదని, అంబానీ పెళ్లిలో డాన్స్ చేసిన వీడియో మాత్రం బయటకొచ్చిందని స్పష్టం చేశారు. సెలబ్రేషన్ లో డాన్స్ చేయడం కామన్ అని విమర్శల్ని కొట్టిపారేశాడు.
అటు షారూక్ ఖాన్ కూడా ఈ అంశంపై స్పందించాడు. ఆత్మీయుల వేడుకల్లో డాన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించాడు. తన ఇంట్లో పెళ్లి జరిగితే అంబానీ కుటుంబ సభ్యులు కూడా డాన్స్ చేస్తారని.. తమ మధ్య అంత అనుబంధం ఉందని తెలిపాడు.
ఇక సల్మాన్ ఖాన్ అయితే తనదైన స్టయిల్ లో ఈ కామెంట్స్ ను తిప్పికొట్టాడు. వేడుకలో డాన్స్ చేసేందుకు కోట్ల రూపాయలు తీసుకున్నాడనే విమర్శల్ని సల్మాన్ తిప్పికొట్టాడు. కొన్ని వేడుకల్లో డాన్స్ చేయాలని మనసుకు అనిపిస్తుందని, డబ్బు కోసం చేయనని అన్నాడు.
ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు స్పందించని హీరో రామ్ చరణ్ మాత్రమే. అతడు కూడా ఖాన్ హీరోలతో డాన్స్ చేశాడు. పైగా స్టేజ్ పైకి వెళ్లే ముందు 'ఇడ్లీ-సాంబార్' కామెంట్స్ ఎదుర్కొన్నాడు.