రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాకు మొదటి రోజు భారీగా వసూళ్లు వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. స్టయిలిష్ బ్లాక్ బస్టర్ గా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించారు.
రిలీజ్ కు ముందు మంచి బజ్ ఉండడంతో ఖిలాడీ మూవీకి హయ్యర్లు భారీగా వచ్చాయి. దీనికితోడు తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగడంతో మొదటి రోజు మంచి వసూళ్లు కళ్లజూసింది రవితేజ సినిమా.
అయితే ఈరోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. డీజే టిల్లుపై కూడా భారీగా బెట్టింగ్ నడవడంతో చాలామంది ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు. ఫలితంగా ఖిలాడీకి ఈరోజు ఆక్యుపెన్సీ తగ్గింది. మరీ ముఖ్యంగా నైజాంలో మార్నింగ్ షోలకు ఆడియన్స్ తగ్గారు.
నిన్న రిలీజైన ఖిలాడీకి మంచి టాక్ రాలేదు. ఈరోజు రిలీజైన డీజే టిల్లుకు మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. దీంతో రేపట్నుంచి రవితేజ సినిమా రన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 25 కోట్ల రూపాయలు రావాలి. హిందీలో నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు.
ఇక ఏరియా వైజ్ చూసుకుంటే.. ఆంధ్రాలో ఈ సినిమాకు కోటి 88 లక్షలు, సీడెడ్ లో 56 లక్షలు, నైజాంలో కోటి 86 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు.