అందం కోసం తను ఎలాంటి సర్జరీల జోలికీ వెళ్లలేదని స్పష్టం చేసింది నటి కియరా అద్వానీ. ఒక టాక్ షోలో ఈ అంశం గురించి, తన గురించి నెటిజన్లు వ్యక్తం చేసే వివిధ అభిప్రాయాల గురించి స్పందించింది. తన గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల నెగిటివ్ కామెంట్లు వినిపించాయని, అలాంటి ఒక దశలో తనను బాధించాయని కియరా అంటోంది.
సినిమా తారల జీవితం అంటే.. కనిపించే అందమైన జీవితం మాట ఎలా ఉన్నా, రకరకాల అపవాదులు ఎదుర్కొనాల్సి ఉంటుందని కియరా అంటోంది. తన గురించి జరిగిన, జరుగుతున్న రకరకాల ప్రచారాల గురించి ఆమెనే ప్రస్తావించి, వాటికి వివరణ ఇచ్చుకుంది.
తనను ఒక పొగరబోతు అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారని కియరా అంటోంది. వారు కోరినప్పుడు ఫొటోలకు పోజులు ఇవ్వకపోవడంతో ఈ అభిప్రాయాన్ని వారు ఏర్పరుచుకుని, దాన్నే ప్రచారం చేశారని కియర అంటోంది. ట్విటర్లో తనను తిడుతూ, బెవకూఫ్ ఔరత్ అంటూ కూడా ట్వీట్ చేసిన విషయం ప్రస్తావనకు వచ్చింది ఆ టాక్ షోలో. అలాంటి ట్వీట్ల గురించి స్పందించేందుకు కూడా ఏమీ ఉండదని కియరా స్పష్టం చేసింది.
ఇక తన అందం గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయని, తను ఒక షోకు అటెంట్ అయ్యాకా..అక్కడ దిగిన ఫొటోలన్నీ వైరల్ అయ్యాయని, వాటిని చూసి.. తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టుగా కొందరు కామెంట్లు చేయ సాగారని కియరా వివరించింది. అయితే తను ఎలాంటి సర్జరీ చేయించుకున్నదీ లేదని ఆమె స్పష్టం చేసింది. సెలబ్రిటీ హోదాను ఆనందించడం మాట ఎలా ఉన్నా.. సోషల్ మీడియా నుంచి వచ్చే వివిధ రకాల తప్పుడు అభిప్రాయాలనూ, నెగిటివ్ కామెంట్స్ ను భరించక తప్పడం లేదని కియరా తన పరిస్థితిని చెప్పుకుంది.